komaravelli
-
కొమురవెల్లిలో భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): కోరిన కోర్కెలు తీర్చే కొమురవెల్లి మల్లన్నను భక్తులు దర్శించుకొని తరించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో ఆదివారం భారీగా తరలివచ్చారు. మల్లన్న నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. సమ్మక్క, సారక్క జాతరకు వెళ్లే భక్తులు స్వామి వారిని దర్శించుకొని మేడారం వెళ్తుండడంతో రద్దీ పెరిగింది. మల్లన్న దర్శనానికి రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఒక్కపొద్దులతో పాటు మట్టికుండలో పసుపు బియ్యంతో నైవేద్యం సమర్పించి గంగిరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు మల్లన్న గుట్టపైన కొలువైన రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. -
కేక్ తిని తండ్రి, కొడుకు మృతి
-
బర్త్ డే కేక్ తిని.. కుటుంబంలో విషాదం
సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని కొమురవెల్లి మండలం అయినాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. బర్త్ డే కేక్ ఓ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. కేక్ తిని తండ్రీ కొడుకు మృతి చెందగా.. మృతుడి భార్య, కూతురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడి సోదరుడు బుధవారం రాత్రి బస్సులో ఈ కేక్‌ను పంపించినట్టు తెలుస్తోంది. అన్నదమ్ముల మధ్య గతకొంతకాలంగా విరోధమున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తమ్ముడు పంపించిన కేక్‌లో విషం కలిపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
కొమురవెల్లిలో భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొ మురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆది వా రం భక్తుల సందడి నెలకొంది. సిద్దిపేట, జనగా మ, హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, నల్లగొం డ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చా రు. దీంతో మల్లన్న ఆలయ ప్రాంగణం మల్లన్న నామస్మరణతో మార్మోగింది. స్వామి వారిని ద ర్శించుకోవడానికి ఆదివారం ఉదయం నుంచి భ క్తులు బారులు తీరారు. మల్లన్నకు ఒక్క పొద్దుల తో బోనాలు తీశారు. బోనాలను రంగులతో అ లంకరించి డప్పు చప్పుళ్లతో శివసత్తులు బోనాలు ఎత్తుకొని గంగిరేగు చెట్టు వద్దకు చేర్చి స్వామికి ఒగ్గు పూజారులతో పట్నాలు వేశారు. అనంతరం మల్లన్న స్వామిని దర్శించుకుని ఒక్క పొద్దులు వదిలారు. మల్లన్న స్వామి దర్శనానికి సుమారు రెండు నుంచి మూడు గంటల సమయం పట్టింది. మరికొంత మంది భక్తులు మల్లన్న ఆలయంలోని ఆలయ ముఖ మండపంలో స్వామికి కల్యాణం జరిపించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మల్లన్నకు మొక్కులు అప్పగించి మల్లన్న గుట్టపై కొలువుదీరిన రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సూపరిం టెండెంట్ రావుల సుదర్శన్, నీల చంద్రశేఖర్‌తోపాటు సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూశారు. -
కొమరవెల్లి మల్లన్నపై సినిమా
కొమురవెల్లి(సిద్దిపేట) : మల్లన్న జీవిత చరిత్ర ఆధారంగా గౌలికర్ శ్రీనివాస్ దర్శక, నిర్మాణంలో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ నాలుగో షెడ్యూల్ ప్రారంభించారు. గురువారం కొమురవెల్లి మండలకేంద్రంలో పలువురు సినిమా నటులు, సీరియల్ నటులు షూటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా దర్శకులు గౌలికర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మల్లన్న జీవిత చరిత్రపై నిర్మిస్తున్న సినిమాను 7 షేడ్యూల్లలో 7 సెట్లలలో తీస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 60శాతం షూటింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు. మల్లన్న వేశాధరణ ప్రత్యేక పాత్రలో సినీనటుడు సుమన్, మిగతా మల్లన్న పాత్రను లాలాజీ ఘన్‌శ్యాం నటిస్తున్నట్లు తెలిపారు. సినిమాకు సహా నిర్మాతలుగా క్రాంతిక్రిష్ణా, మహేందర్‌రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్‌గా కె.నవీన్మాధవ్, కోరియోగ్రాఫర్లుగా శ్యామిల్, జోజో, ఘన్‌శ్యాం, సంగీతం విజయ్ కూరకాల, విజువల్ ఎఫెక్టŠస్ శ్రీనివాస్, ముఖ్య తారాగణం ఆనంద్ భూపతి, శ్రీదేవి, కుమార్ మిట్టపల్లి, సహకారం మందాల బాబు, మందాల శేఖర్, సిద్దిపేట శ్రీనివాస్‌లతో పాటు పలువురు నటులు పాల్గొన్నారు. -
అదృశ్యమై.. అస్థిపంజరంగా.
కొమురవెల్లి(సిద్దిపేట): మూడు నెలల క్రితం గురువన్నపేటలో అదృశ్యమైన వృద్ధురాలి అస్థిపంజరం లభ్యమైన ఘటన సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గురువన్నపేటకు చెందిన బండారు గౌరవ్వ(75) జనవరి 22న అదృశ్యమైన సంగతి మనకు తెలిసిందే. కాగా, జనవరి 24న కుటుంబ సభ్యులు కొమురవెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం గురువన్నపేట వాగులో ఓ గొర్రెల కాపరికి మనిషి పుర్రె కనిపించింది. దీంతో ఈ విషయాన్ని ఇరుగుపొరుగుకు తెలియజేయడంతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. చేర్యాల సీఐ రఘు, కొమురవెల్లి ఎస్ఐ సతీశ్‌కుమార్‌తో పాటు గౌరవ్వ కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, చీర, కొన్ని వస్తువుల ఆధారంగా అస్థిపంజరం గౌరవ్వదిగా ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. వృద్ధురాలికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
మల్లన్నను దర్శించుకున్న సినీ నటుడు
కొమురవెల్లి(సిద్ధిపేట జిల్లా): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామికి సినిమా నటుడు ఫిష్ వెంకట్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం మండల కేంద్రంలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. పలు సినిమాల్లో విలన్ అసిస్టెంట్ పాత్రలు పోషించి తన కామెడీతో అలరించిన ఫిష్ వెంకట్ మాట్లాడుతూ కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి తనకు ఇష్టదైవమని, ప్రతి ఏటా స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటానని అన్నారు. ఇక, స్థానిక ప్రజలు, చిరువ్యాపారులు సినిమా నటుడు ఫిష్ వెంకటేశ్‌తో కలిసి సెల్ఫీలు తీసుకుంటూ సందడిగా గడిపారు. -
కొమరవెల్లిలో సీఎం కేసీఆర్