కొమరవెల్లి మల్లన్నపై సినిమా | Movie on Kavaravelli Mallanna | Sakshi

కొమరవెల్లి మల్లన్నపై సినిమా

May 4 2018 12:50 PM | Updated on Oct 8 2018 9:10 PM

Movie on Kavaravelli Mallanna - Sakshi

కొమురవెల్లి(సిద్దిపేట) :  మల్లన్న జీవిత చరిత్ర ఆధారంగా గౌలికర్‌ శ్రీనివాస్‌ దర్శక, నిర్మాణంలో నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌ నాలుగో షెడ్యూల్‌ ప్రారంభించారు. గురువారం కొమురవెల్లి మండలకేంద్రంలో పలువురు సినిమా నటులు, సీరియల్‌ నటులు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా దర్శకులు గౌలికర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ మల్లన్న జీవిత చరిత్రపై నిర్మిస్తున్న సినిమాను 7 షేడ్యూల్‌లలో 7 సెట్లలలో తీస్తున్నామని తెలిపారు.

ఇందులో భాగంగా ఇప్పటి వరకు 60శాతం షూటింగ్‌ పూర్తి చేసినట్లు తెలిపారు. మల్లన్న వేశాధరణ ప్రత్యేక పాత్రలో సినీనటుడు సుమన్, మిగతా మల్లన్న పాత్రను లాలాజీ ఘన్‌శ్యాం నటిస్తున్నట్లు తెలిపారు. సినిమాకు సహా నిర్మాతలుగా క్రాంతిక్రిష్ణా, మహేందర్‌రెడ్డి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కె.నవీన్‌మాధవ్, కోరియోగ్రాఫర్లుగా శ్యామిల్, జోజో, ఘన్‌శ్యాం, సంగీతం విజయ్‌ కూరకాల, విజువల్‌ ఎఫెక్టŠస్‌ శ్రీనివాస్, ముఖ్య తారాగణం ఆనంద్‌ భూపతి, శ్రీదేవి, కుమార్‌ మిట్టపల్లి, సహకారం మందాల బాబు, మందాల శేఖర్, సిద్దిపేట శ్రీనివాస్‌లతో పాటు పలువురు నటులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement