బర్త్‌ డే కేక్‌ తిని.. కుటుంబంలో విషాదం | Man and His Son Died By Eating Cake | Sakshi
Sakshi News home page

బర్త్‌ డే కేక్‌ తిని.. కుటుంబంలో విషాదం

Published Thu, Sep 5 2019 9:08 AM | Last Updated on Thu, Sep 5 2019 2:16 PM

Man and His Son Died By Eating Cake - Sakshi

సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని కొమురవెల్లి మండలం అయినాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. బర్త్‌ డే కేక్‌ ఓ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. కేక్‌ తిని తండ్రీ కొడుకు మృతి చెందగా.. మృతుడి భార్య, కూతురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడి సోదరుడు బుధవారం రాత్రి బస్సులో ఈ కేక్‌ను పంపించినట్టు తెలుస్తోంది. అన్నదమ్ముల మధ్య గతకొంతకాలంగా విరోధమున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తమ్ముడు పంపించిన కేక్‌లో విషం కలిపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement