
దుర్గగుడిలో అపచారం
దుర్గగుడిలో అత్యంత పవిత్రంగా జరుగుతున్న దసరా ఉత్సవాలలో అపచారం చోటుచేసుకుంది.
దుర్గమ్మ నివేదన మధ్యలో ఆపేయడం మంచిది కాదని ఆలయ పండితులు వాపోతున్నారు. అమ్మ వారికి ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు నివేదన సమర్పిస్తారు. ఆ సమయంలో గర్భగుడిలోనికి ఎవ్వరినీ అనుమతించరు. గర్భాలయాన్ని శుద్ధి చేసిన తర్వాత అమ్మ వారికి నివేదనిస్తారు. మంగళవారం గర్భాలయాన్ని శుద్ధి చేయకుండా నివేదన సమర్పించడంతో పాటు మధ్యలో నివేదనను ఆపడంపై ఆలయ పండితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.