విజయవాడ: ప్రఖ్యాత ఇంద్రకీలాద్రి శ్రీ కనక దుర్గ ఆలయానికి ఉపాలయంగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడిలో అపచారం చోటుచేసుకుంది. ఆలయంలోని శ్రీవల్లి అమ్మవారి మంగళసూత్రం మూడు నెలల కిందట హఠాత్తుగా కనిపించకుండా పోయింది. ఆలయంలోని ఓ అర్చకుడు అమ్మవారి బంగారు తాళిబొట్టును తాకట్టు పెట్టి సొమ్ముచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ అధికారులు ఈ అంశం వివాదాస్పదంగా మారకముందే గుట్టుచప్పుడు కాకుండా తాకట్టు నుంచి మంగళసూత్రాలను విడిపించినట్లు సమాచారం.
అయితే సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోని కొందరు సిబ్బంది ఈ విషయాన్ని బయటపెట్టడంతో మొత్తం వ్యవహారం వెలుగు చూసింది. మరోవైపు ఈ అంశం తన దృష్టికి రాలేదని ఆలయ ఈఓ సూర్యకుమారి చెబుతున్నారు. అ సంఘటనపై విచారణ జరుపుతామని చెబుతున్నారు. ఇప్పటికే దుర్గ గుడిలో అధికారుల తీరు పలు వివాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో తాళిబొట్టు మాయమైన అంశం మరో వివాదంగా మారుతుందనే ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది.
తాకట్టులో అమ్మవారి మంగళసూత్రం
Published Sun, Oct 29 2017 3:34 PM | Last Updated on Sun, Oct 29 2017 7:22 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment