![CBI Raids on TDP Leader Savitha House in Penukonda - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/4/TDP.jpg.webp?itok=2aemoVGl)
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: పెనుకొండలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. టీడీపీ నేత సవిత ఇంట్లో సీబీఐ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. బెంగళూరు నుంచి సీబీఐ అధికారులు నేరుగా టీడీపీ నేత సవిత ఇంటికి చేరుకున్నారు. సోదాల్లో ఇప్పటికే పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
సవితకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. రైల్వే కాంట్రాక్టు పనుల్లో అక్రమాలపై భాగంగానే ఈ సోదాలు చేపట్టారు. టీడీపీ నేత సవిత భర్త వెంకటేశ్వరరావు రైల్వే కాంట్రాక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment