
న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇతిమరపు రజని తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈనెల 27 నుంచి అక్టోబర్ 4 వరకు ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టును శుక్రవారం ప్రకటించారు. స్టార్ ఫార్వర్డ్ రాణి రాంపాల్ కెప్టెన్‌గా, గోల్‌కీపర్ సవిత వైస్ కెపె్టన్‌గా నియమితులయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన రజని జట్టులో రెండో గోల్‌కీపర్‌గా వ్యవహరిస్తుంది. గాయం కారణంగా ఆటకు దూరమైన మిడ్‌ఫీల్డర్ నమిత టొప్పొ పునరాగమనం చేసింది. ఇటీవల టోక్యోలో జరిగిన ఒలింపిక్ టెస్టు ఈవెంట్ విజేతగా నిలిచిన భారత్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ముఖ్యంగా రాణి రాంపాల్, గుర్జీత్ కౌర్, నవ్‌నీత్ కౌర్‌లు అద్భుత ఫామ్‌లో ఉన్నారు.
జట్టు వివరాలు: రాణి రాంపాల్ (కెపె్టన్), సవిత (వైస్ కెపె్టన్), ఇతిమరపు రజని, దీప్ గ్రేస్ ఎక్కా, గుర్జీత్ కౌర్, రీనా ఖోఖర్, సలీమా తెతె, సుశీలా చాను, నిక్కీ ప్రధాన్, మోనిక, నేహా గోయల్, లిలిమా మింజ్, నమిత, వందన, నవ్‌నీత్ కౌర్, నవ్‌జ్యోత్ కౌర్, షరి్మలా దేవి, లాల్‌రెమ్‌సియామి.
Comments
Please login to add a commentAdd a comment