భారత మహిళల హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది.
భోపాల్: భారత మహిళల హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. బెలారస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రాణి రాంపాల్ సేన వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ 2–1 గోల్స్ తేడాతో బెలారస్‌ను ఓడించింది.
ఆట ఆరంభమైన ఆరో నిమిషంలోనే రేణుకా యాదవ్ ఫీల్డ్ గోల్ చేయగా... మరో ఆరు నిమిషాలకు గుర్జీత్ కౌర్ (12వ ని.) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది. రెండో క్వార్టర్‌లో బెలారస్ తరఫున నస్టాసియా సైరయెజ్కా ఫీల్డ్ గోల్ సాధించింది.