
రూర్కెలా: పురుషుల ప్రొ హాకీ లీగ్ భారత అంచె పోటీలను టీమిండియా విజయంతో ముగించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 4–0 గోల్స్ తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది.
భారత్ తరఫున నీలకంఠ శర్మ (14వ ని.లో), ఆకాశ్‌దీప్ సింగ్ (15వ ని.లో), గుర్జంత్ సింగ్ (38వ ని.లో), జుగ్‌రాజ్ సింగ్ (60వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో భారత జట్టు 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment