భువనేశ్వర్: ఆద్యంతం అటాకింగ్‌తో ప్రత్యర్థిపై చెలరేగిన భారత జట్టు ప్రొ హాకీ లీగ్‌లో కీలక విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 7–4 గోల్స్ తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. తొలి క్వార్టర్‌లో కివీస్ ఆధిక్యం ప్రదర్శించినా, ఆ తర్వాత భారత్ జోరు ముందుకు నిలవలేకపోయింది.
భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ల ద్వారా రెండు గోల్స్ (7వ నిమిషం, 19వ ని.) సాధించగా, కార్తీ సెల్వమ్ (17వ ని., 38వ ని.) మరో రెండు గోల్స్ కొట్టాడు. రాజ్‌కుమార్ పాల్ (31వ ని.), సుఖ్‌జీత్ సింగ్ (50వ ని.), జుగ్‌రాజ్ సింగ్ (53వ ని.) భారత్‌కు మిగతా గోల్స్ అందించారు. న్యూజిలాండ్ తరఫున సైమన్ చైల్డ్ (2వ ని.), స్యామ్ లేన్ (9వ ని.), స్మిత్ జేక్ (14వ ని.), నిక్‌వుడ్స్ (54వ ని.) గోల్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment