
రూర్కెలా: ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా ప్రపంచ చాంపియన్ జర్మనీ జట్టుతో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 6–3 గోల్స్‌తో గెలిచింది. మూడు రోజుల వ్యవధిలో జర్మనీపై భారత్‌కిది రెండో గెలుపు కావడం విశేషం. ఈ విజయంతో భారత్ 17 పాయింట్లతో ‘టాప్’లోకి వచ్చింది.
భారత్ తరఫున సెల్వం కార్తీ (24వ, 46వ ని.లో), అభిషేక్ (22వ, 51వ ని.లో) రెండు గోల్స్ చొప్పున సాధించగా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (26వ ని.లో), జుగ్‌రాజ్ (21వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. జర్మనీ తరఫున గ్రామ్‌బుష్ (3వ ని.లో), పీలాట్ (23వ ని.లో), హెల్‌విగ్ (33వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment