భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ప్రొ హాకీ లీగ్‌లో భారత పురుషుల జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. నెదర్లాండ్స్‌తో తొలి రౌండ్ రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన టీమిండియా... ప్రపంచ చాంపియన్ బెల్జియంతో శనివారం రెండో రౌండ్ తొలి మ్యాచ్‌లో 2–1తో సంచలన విజయం సాధించింది. ఆట రెండో నిమిషంలో మన్‌దీప్ సింగ్ గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. 33వ నిమిషంలో బొకార్డ్ గోల్‌తో బెల్జియం స్కోరును సమం చేసింది. ఆ తర్వాత 47వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను రమణ్‌దీప్ సింగ్ గోల్‌గా మలచడంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్ విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు ఇదే వేదికపై ఈ రెండు జట్లు మళ్లీ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment