
చైనా ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)–పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) జంట పోరాటం ముగిసింది. బీజింగ్‌లో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–క్యువాస్ ద్వయం 5–7, 6–7 (6/8)తో టాప్ సీడ్ హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్)–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. క్వార్టర్స్‌లో ఓడిన బోపన్న జోడీకి 24,755 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 16 లక్షల 12 వేలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment