
లియాండర్ పేస్ భవితవ్యం తేలేది నేడే...
డేవిస్‌కప్ టెన్నిస్ చరిత్రలో అత్యధిక డబుల్స్ విజయాలు సాధించిన ప్లేయర్‌గా గుర్తింపు పొందడానికి లియాండర్ పేస్ కేవలం ఒక విజయం దూరంలో ఉన్నాడు. ఈ రికార్డు సాధించేందుకు పేస్‌కు మరో అవకాశం ఇస్తారా లేదా అనేది నేడు తేలిపోనుంది. ఏప్రిల్ 7 నుంచి 9 వరకు ఉజ్బెకిస్తాన్‌తో బెంగళూరులో జరిగే ఆసియా ఓసియానియా పోటీలో భారత్ తలపడనుంది.
నలుగురు సభ్యులతో కూడిన తుది జట్టును మంగళవారం నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి ప్రకటించనున్నారు. ఒకే డబుల్స్ స్పెషలిస్ట్‌ను ఎంపిక చేస్తే మాత్రం రోహన్ బోపన్న లేదా పేస్‌లలో ఒకరికే తుది జట్టులో స్థానం లభిస్తుంది.