గతేడాది ప్రాగ్ ఓపెన్ టోర్నీ గెలిచిన సంబరంలో సిమోనా
రొమేనియా: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరమైన స్టార్ ప్లేయర్ల జాబితాలో మరొకరు చేరారు. పురుషుల సింగిల్స్‌లో 2015 చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్), మాజీ నంబర్‌వన్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఈ మెగా ఈవెంట్‌కు దూరంకాగా ... తాజాగా మహిళల సింగిల్స్‌లో 2018 చాంపియన్, మూడో ర్యాంకర్ సిమోనా హలెప్ బరిలోకి దిగడంలేదని ప్రకటించింది. కాలిపిక్క గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హలెప్ తెలిపింది. ఈనెల 30న ఫ్రెంచ్ ఓపెన్ మొదలవుతుంది.
క్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట ఓటమి
జెనీవా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)–ఫ్రాంకోస్కుగర్ (క్రొయేషియా) పోరాటం ముగిసింది. స్విట్జర్లాండ్‌లో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ బోపన్న–స్కుగర్ ద్వయం 3–6, 6–3, 11–13తో ‘సూపర్ టైబ్రేక్’లో గొంజాలో ఎస్కోబార్ (కొలంబియా)–ఏరియల్ బెహర్ (ఉరుగ్వే) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. క్వార్టర్స్‌లో ఓడిన బోపన్న జంటకు 4,710 యూరోల (రూ. 4 లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment