
ప్రిక్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట
మోంటెకార్లో (మొనాకో): క్లే కోర్టు సీజన్‌లోని తొలి టోర్నమెంట్ మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత డబుల్స్ నంబర్‌వన్ ప్లేయర్ రోహన్ బోపన్న శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో బోపన్న–పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) ద్వయం 6–3, 7–6 (9/7), 10–2తో ‘సూపర్ టైబ్రేక్’లో మార్సిన్ మట్కోవ్‌స్కీ (పోలాండ్)–అలెగ్జాండర్ పెయా (ఆస్ట్రియా) జంటపై గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో రాజీవ్ రామ్ (అమెరికా)–రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జంటతో బోపన్న–క్యువాస్ జోడీ ఆడుతుంది.