
సెయింట్ పీటర్స్‌బర్గ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–షపోవలోవ్ (కెనడా) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. రష్యాలో జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–షపోవలోవ్ జోడీ 6–4, 5–7, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో ఖచనోవ్–రుబ్లెవ్ (రష్యా) జంటపై నెగ్గింది. 87 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో బోపన్న జోడీ ఆరు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment