
అంకితా రైనా (ఫైల్ ఫొటో)
సాక్షి, న్యూఢిలీ : మంచి ప్రదర్శనలతో దూసుకుపోతున్న ఇండియన్ టెన్నిస్ స్టార్ అంకితా రైనా సెమీఫైనల్‌లో ఓటమి పాలయ్యారు. చైనా ప్లేయర్ జంగ్ షౌల్‌తో రెండు గంటలకు పైగా జరిగిన మ్యాచ్‌లో వరుస సెట్ల (4-6, 6-7)లో ఓడిపోయారు. దాంతో కాంస్య పతకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా, ఏషియన్ గేమ్స్‌లో మహిళల టెన్నిస్ సింగిల్స్‌లో పతకం గెలుపొందిన రెండో ప్లేయర్‌గా అంకిత నిలిచారు. అంతకు ముందు 2006, 2010 ఏషియన్ గేమ్స్‌లో సానియా మీర్జా వరుసగా రజతం, కాంస్య పతకాలు గెలుపొందారు.
ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయం అయింది. పురుషుల టెన్నిస్ డబుల్స్‌లో బోపన్న-శరణ్ జోడీ ఫైనల్ చేరింది. సెమీఫైనల్‌లో జపాన్ జోడీ ఉసుంగు-షమబుకరోపై గెలిచి భారత్‌కు పతకం ఖరారు చేసిందీ ద్వయం. కాగా, నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, తొమ్మిది కాంస్య పతకాలు సాధించిన భారత్.. మొత్తం 16 పతకాలతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.