
బోపన్న జంట శుభారంభం
రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)–పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) జంట రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో బోపన్న–క్యువాస్ ద్వయం 6–4, 6–2తో సిమోన్ బొలెలీ–ఆండ్రియా సెప్పి (ఇటలీ) జోడీపై గెలిచింది.