
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రద్మ పురస్కారాలను ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను మొత్తం 132 మంది ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీటిలో ఐదు పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి.
ఈ ఏడాది క్రీడారంగం నుంచి మొత్తం ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. వెటరన్ టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చినప్ప, హాకీ క్రీడాకారుడు హర్బిందర్ సింగ్, పూర్ణిమా మహతో (ఆర్చరీ), సతేంద్ర సింగ్ లోహియా (స్విమ్మింగ్), గౌరవ్ ఖన్నా (బ్యాడ్మింటన్), ఉదయ్ విశ్వనాథ్ దేశ్‌పాండేలను (మల్లఖంబ-కోచ్) పద్మశ్రీ అవార్డులు వరించాయి.
Comments
Please login to add a commentAdd a comment