
మోంటెకార్లో: భారత డబుల్స్ టెన్నిస్ నంబర్‌వన్ రోహన్ బోపన్న మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–వాసెలిన్ (ఫ్రాన్స్) జంట 6–4, 6–4తో సెబాస్టియన్ కబాల్–రాబర్ట్ ఫరా (కొలంబియా) జోడీపై విజయం సాధించింది. 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట ఆరు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయిన ఈ ఇండో–ఫ్రెంచ్ జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. శనివారం జరిగే సెమీఫైనల్లో ఒలివర్ మరాచ్ (ఆస్ట్రియా)–మ్యాట్ పావిచ్ (క్రొయేషియా)లతో బోపన్న–వాసెలిన్ తలపడతారు.
నాదల్ 13వసారి...
మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో పదిసార్లు చాంపియన్ రాఫెల్ నాదల్ 13వ సారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నాదల్ 6–0, 6–2తో ఐదోసీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను చిత్తుగా ఓడించాడు.
Comments
Please login to add a commentAdd a comment