లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ఆన్స్ జబర్ (ట్యునీషియా), మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో గత ఏడాది రన్నరప్, ప్రపంచ ఆరో ర్యాంకర్ జబర్ 6–7 (5/7), 6–4, 6–3తో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్)పై నెగ్గగా... వొండ్రుసోవా 6–3, 6–3తో ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)ను ఓడించింది.
ఫైనల్ శనివారం జరుగుతుంది. జబర్‌తో 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకా ఏకంగా 45 అనవసర తప్పిదాలు, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకుంది. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్)ను బోల్తా కొట్టించిన స్వితోలినా సెమీఫైనల్లో మాత్రం తడబడింది. ఒక్కఏస్ కూడా కొట్టలేకపోయిన స్వితోలినా నెట్ వద్దకు 21 సార్లు దూసుకొచ్చి ఆరుసార్లు పాయింట్లు గెలిచింది.
బోపన్న జోడీ ఓటమి
పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ 5–7, 4–6తో టాప్ సీడ్ వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జంట చేతిలో ఓడిపోయింది. సెమీస్‌లో ని్రష్కమించిన బోపన్న జోడీకి లక్షా 50 వేల పౌండ్లు (రూ. కోటీ 61 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
నేడు జరిగే పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో యానిక్ సినెర్ (ఇటలీ)తో జొకోవిచ్ (సెర్బియా); మెద్వెదెవ్ (రష్యా)తో అల్‌కరాజ్ (స్పెయిన్) తలపడతారు. ఈ మ్యాచ్‌లను సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
చదవండి: #KylianMbappe: ప్రధాని నోట 'ఎంబాపె' మాట..'నీకు భారత్‌లో మస్తు క్రేజ్'
జ్యోతి ‘స్వర్ణ’ చరిత్ర.. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా ఆంధ్రప్రదేశ్ అమ్మాయి
Comments
Please login to add a commentAdd a comment