బోపన్న జోడీకి చుక్కెదురు | Indian doubles star Rohan Bopanna was disappointed | Sakshi
Sakshi News home page

బోపన్న జోడీకి చుక్కెదురు

Published Sun, Sep 29 2024 2:46 AM | Last Updated on Sun, Sep 29 2024 2:46 AM

Indian doubles star Rohan Bopanna was disappointed

చైనా ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నీలో భారత డబుల్స్‌ స్టార్‌ రోహన్‌ బోపన్నకు నిరాశ ఎదురైంది. బీజింగ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో రెండో సీడ్‌ బోపన్న (భారత్‌)–ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా) జంట తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. 

శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో బోపన్న–డోడిగ్‌ జంట 5–7, 6–7 (4/7)తో సెరున్‌డొలో (అర్జెంటీనా)–నికోలస్‌ జారీ (చిలీ) ద్వయం చేతిలో ఓడిపోయింది. బోపన్న–డోడిగ్‌లకు 15,960 డాలర్ల (రూ. 13 లక్షల 35 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement