
Paris Olympics 2024: వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలను ప్రత్యక్షంగా తిలకించేందుకు రెండో దశలో 40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే నెలలో ఆన్‌లైన్ లాటరీ ద్వారా 13 లక్షల మందిని ఎంపిక చేస్తారు. తొలి దశలో 32 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి.
సెమీస్‌లో బోపన్న జోడీ
బార్సిలోనా: బార్సిలోనా ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–2, 6–4తో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–ఎడ్వర్డ్ రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంటను ఓడించింది.
64 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో బోపన్న, ఎబ్డెన్ రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు.
మే 28న అహ్మదాబాద్‌లో ఐపీఎల్ ఫైనల్
న్యూఢిల్లీ: ఐపీఎల్ 16వ సీజన్ ప్లే ఆఫ్ దశ షెడ్యూల్‌ను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. మే 23న క్వాలిఫయర్–1 మ్యాచ్‌కు... మే 24న ఎలిమినేటర్ మ్యాచ్‌కు చెన్నైలోని ఎం.ఎ.చిదంబరం స్టేడియం వేదికగా నిలుస్తుంది.
మే 26న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం క్వాలిఫయర్–2 మ్యాచ్‌కు, మే 28న ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment