
న్యూఢిల్లీ: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 ప్లే–ఆఫ్ టైలో భాగంగా డెన్మార్క్‌తో జరుగుతున్న పోరులో శుక్రవారం భారత్ 2–0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్ 6–3, 6–2తో క్రిస్టియాన్ సిగ్స్‌గార్డ్‌పై అలవోక విజయం సాధించాడు. ప్రపంచ 170వ ర్యాంకర్ రామ్‌కుమార్ కేవలం 59 నిమిషాల్లోనే 824వ ర్యాంకింగ్ ప్లేయర్‌పై గెలిచాడు. సుదీర్ఘ విరామానంతరం... 2017 తర్వాత మళ్లీ డేవిస్ కప్ బరిలోకి దిగిన యూకీ బాంబ్రీ రెండో సింగిల్స్‌లో 6–4, 6–4తో మికేల్ టొర్పెగార్డ్‌ను ఓడించాడు.
నేడు జరిగే డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జోడీ గెలిస్తే చాలు భారత్ రివర్స్ సింగిల్స్ ఆడే అవకాశం లేకుండానే విజయం సాధిస్తుంది. ఇదే జరిగితే భారత్ వరల్డ్ గ్రూప్–1లో స్థానాన్ని నిలబెట్టుకుంటుంది.
చదవండి: national chess championship 2022: విజేతగా అర్జున్.. తొలి తెలంగాణ ఆటగాడిగా రికార్డు