ramkumar pair
-
డేవిస్ కప్‌లో రామ్‌కుమార్, యూకీ బాంబ్రీ గెలుపు
న్యూఢిల్లీ: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 ప్లే–ఆఫ్ టైలో భాగంగా డెన్మార్క్‌తో జరుగుతున్న పోరులో శుక్రవారం భారత్ 2–0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్ 6–3, 6–2తో క్రిస్టియాన్ సిగ్స్గార్డ్పై అలవోక విజయం సాధించాడు. ప్రపంచ 170వ ర్యాంకర్ రామ్‌కుమార్ కేవలం 59 నిమిషాల్లోనే 824వ ర్యాంకింగ్ ప్లేయర్‌పై గెలిచాడు. సుదీర్ఘ విరామానంతరం... 2017 తర్వాత మళ్లీ డేవిస్ కప్ బరిలోకి దిగిన యూకీ బాంబ్రీ రెండో సింగిల్స్‌లో 6–4, 6–4తో మికేల్ టొర్పెగార్డ్ను ఓడించాడు. నేడు జరిగే డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జోడీ గెలిస్తే చాలు భారత్ రివర్స్ సింగిల్స్ ఆడే అవకాశం లేకుండానే విజయం సాధిస్తుంది. ఇదే జరిగితే భారత్ వరల్డ్ గ్రూప్–1లో స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. చదవండి: national chess championship 2022: విజేతగా అర్జున్.. తొలి తెలంగాణ ఆటగాడిగా రికార్డు -
రామ్‌కుమార్‌కు ‘వైల్డ్ కార్డు’
‘టాటా ఓపెన్’ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్‌కు ‘వైల్డ్ కార్డు’ కేటాయించారు. దాంతో రామ్‌కుమార్ పురుషుల సింగిల్స్‌లో నేరుగా మెయిన్ ‘డ్రా’లో ఆడతాడు. టాటా గ్రూప్ స్పాన్సర్ చేస్తున్న ఈ టోర్నీ మహారాష్ట్రలోని పుణేలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరుగుతుంది. గత నవంబర్‌లో రామ్ బహ్రెయిన్ ఓపెన్ లో విజేతగా నిలిచి కెరీర్లో తొలి ఏటీపీ చాలెంజర్ టైటిల్‌ను సాధించాడు. చదవండి: IPL: వాళ్లిద్దరు నా ఫేవరెట్ ప్లేయర్లు... ఐపీఎల్లో ఆ జట్టుకు ఆడాలని ఉంది: దక్షిణాఫ్రికా యువ సంచలనం ఏబీడీ 2.0! -
క్వార్టర్స్‌లో రామ్‌కుమార్ జంట
లెక్సింగ్టన్ (యూఎస్): ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో రామ్‌కుమార్ జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో రామ్‌కుమార్-జీవన్ జోడి 7-6 (5), 4-6, 12-10తో బ్రిడన్ క్లెవిన్-ఆండ్రూ విట్టింగ్టన్ జంటపై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో ఈ జంట దక్షిణాఫ్రికాకు చెందిన డీన్ ఓ బ్రయాన్-రూన్ రోలెఫ్సో జోడితో తలపడుతుంది.