Rohan Bopanna: బోపన్న జోడీ సంచలనం  | St Petersburg Open: Bopanna Shapovalov Pair Enters Into Quarters | Sakshi
Sakshi News home page

Rohan Bopanna: బోపన్న జోడీ సంచలనం 

Published Wed, Oct 27 2021 8:40 AM | Last Updated on Wed, Oct 27 2021 3:24 PM

St Petersburg Open: Bopanna Shapovalov Pair Enters Into Quarters - Sakshi

St Petersburg Open: సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–డెనిస్‌ షపోవలోవ్‌ (కెనడా) జంట క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. రష్యాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో బోపన్న–షపోవలోవ్‌ ద్వయం 7–5, 6–4తో రెండో సీడ్‌ రావెన్‌ క్లాసెన్‌ (దక్షిణాఫ్రికా)–బెన్‌ మెక్లాచ్‌లన్‌ (జపాన్‌) జోడీపై విజయం సాధించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట పది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది.

చదవండి: IND vs PAK: ఆటా? మతవిద్వే షపు సయ్యాటా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement