ఓటమితో తీవ్ర అసహనానికి గురైన జర్మని టెన్నిస్ స్టార్ నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మైదానంలోనే తన ఫ్రస్టేషన్‌ను చూపించాడు. అందరి ముందే తీవ్ర చికాకుతో టెన్నిస్ రాకెట్‌ను ఎనిమిదిసార్లు నేలకేసి కొట్టాడు. తన కన్నా ఎక్కువ ర్యాంకైన ఆరో సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) చేతిలో జ్వెరెవ్ ఘోరపరాజయాన్ని చూశాడు. దీంతో తన కోపాన్ని రాకెట్‌పై ప్రదర్శించాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో భాగంగా సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో జ్వెరెవ్ వరుస సెట్లలో 1-6, 1-6, 6(5)-7 తేడాతో మిలోస్ రావ్‌నిచ్ చేతిలో ఓటమి పాలయ్యాడు.