
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత కథ ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 12–21, 24–26తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జోడీ కెవిన్ సుకముల్జో–మార్కస్ గిడియోన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయింది.
శుక్రవారం ఆలస్యంగా ముగిసిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ 16–21, 19–21తో ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. మొమోటా చేతిలో శ్రీకాంత్‌కిది వరుసగా ఏడో ఓటమి కావడం గమనార్హం. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ పీవీ సింధు 13–21, 16–21తో ఏడో సీడ్ హి బింగ్‌జియావో (చైనా) చేతిలో పరాజయం పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment