Satwick Sairaj
-
French Open 2024 : సాత్వి క్–చిరాగ్ జోడీదే టైటిల్
పారిస్: ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ సాత్వి క్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ ఈ ఏడాది తమ ఖాతాలో తొలి టైటిల్‌ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోరీ్నలో సాత్విక్–చిరాగ్ ద్వయం చాంపియన్‌గా నిలిచింది. కేవలం 37 నిమిషాల్లో ముగిసిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జంట సాత్వి క్–చిరాగ్ 21–11, 21–17తో లీ జె హుయ్–పో సువాన్ యాంగ్ (చైనీస్ తైపీ) జోడీని ఓడించింది. టైటిల్ గెలిచే క్రమంలో భారత జోడీ తమ ప్రత్యర్థులకు ఒక్కగేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. విజేతగా నిలిచిన సాత్వి క్–చిరాగ్ శెట్టిలకు 62,900 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 52 లక్షలు), 11,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టి 2022లోనూ ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ గెలిచారు. ఈ ఏడాది సాత్వి క్–చిరాగ్ మలేసియా మాస్టర్స్ టోర్నీ, ఇండియా ఓపెన్ టోరీ్నలలో ఫైనల్ చేరి రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు. మూడో టోర్నీలో మాత్రం ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా విజేతగా నిలిచారు. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ కాంగ్ మిన్ హుక్–సియో సెంగ్ జే (దక్షిణ కొరియా) జోడీని 21–13, 21–16తో చిత్తు చేసిన సాత్వి క్–చిరాగ్... ఫైనల్లోనూ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. సుదీర్ఘ ర్యాలీలు సాగకుండా కళ్లు చెదిరే స్మాష్‌లతో పాయింట్లను తొందరగా ముగించారు. తొలి గేమ్‌లో తొలి ఏడు నిమిషాల్లోనే సాత్వి క్–చిరాగ్ 11–4తో ఆధిక్యంలోకి వెళ్లారు. ఆ తర్వాత అదే జోరును కొనసాగిస్తూ మరో నాలుగు నిమిషాల్లో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నారు. రెండో గేమ్‌లో చైనీస్ తైపీ జోడీ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా కీలకదశలో భారత ద్వయం పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. -
సింధు ఇంటికి... సైనా ముందుకు
న్యూఢిల్లీ: ఈ ఏడాది వరుసగా రెండో అంతర్జాతీయ టోర్నీలోనూ భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. గతవారం మలేసియా ఓపెన్ టోర్నీలోనూ సింధు తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 45 నిమిషాల్లో 12–21, 20–22తో ప్రపంచ 30వ ర్యాంకర్ సుపనిద కటెథోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలైంది. గత ఏడాది ఇండియా ఓపెన్‌లో సెమీఫైనల్లో సుపనిద చేతిలోనే ఓడిపోయిన సింధుకు ఈసారీ అదే ఫలితం ఎదురైంది. మరోవైపు భారత్‌కే చెందిన మరో స్టార్ సైనా నెహ్వాల్ తీవ్రంగా శ్రమించి తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించింది. ప్రపంచ 24వ ర్యాంకర్ మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో 63 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21–17, 12–21, 21–19తో విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. లక్ష్య సేన్ శుభారంభం పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ లక్ష్య సేన్ (భారత్) శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో లక్ష్య సేన్ 21–14, 21–15తో భారత్‌కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. గతవారం మలేసియా ఓపెన్ తొలి రౌండ్ లో ప్రణయ్ చేతిలో ఎదురైన ఓటమికి ఈ విజయంతో లక్ష్య సేన్ బదులు తీర్చుకున్నాడు. సాత్విక్ జోడీ ముందంజ పురుషుల డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపి యన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–15తో మాథ్యూ–క్రిస్టోఫర్ గ్రిమ్లే (స్కాట్లాండ్) జోడీపై గెలిచింది. మరో మ్యాచ్‌లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గరగ కృష్ణప్రసాద్ (భారత్) జోడీ 21–11, 23–25, 21–9తో రూబెన్ జిలీ–టియెస్ వాన్ డెర్ (నెదర్లాండ్స్) ద్వయంపై నెగ్గింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జంట 22–20, 17–21, 21–18తో మార్గోట్ లాంబర్ట్–ఆనీ ట్రాన్ (ఫ్రాన్స్) జోడీపై గెలుపొందగా... సిక్కి రెడ్డి–శ్రుతి మిశ్రా (భారత్) ద్వయం 17–21, 19–21తో లిండా ఎఫ్లెర్–ఇసాబెల్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోయింది. చదవండి: IND vs NZ 1st ODI: టీమిండియాతో తొలి వన్డే.. న్యూజిలాండ్‌కు బిగ్ షాక్ -
మెయిన్ ‘డ్రా’కు కశ్యప్ అర్హత
కౌలూన్ (హాంకాంగ్): కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్ హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో కశ్యప్ 21–7, 12–21, 21–18తో టాప్ సీడ్ సు జెన్ హావో (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో ఇస్కందర్ జుల్కర్నైన్ (మలేసియా) నుంచి కశ్యప్‌నకు వాకోవర్ లభించింది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 21–16, 19–21, 21–14తో వాంగ్‌చి లిన్–లి చియా సిన్ (చైనీస్ తైపీ) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సుపన్యు అవింగ్‌సనోన్ (థాయ్‌లాండ్)తో సమీర్ వర్మ; ఖోసిత్ ఫెత్రాదబ్ (థాయ్‌లాండ్)తో సాయిప్రణీత్; వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో కిడాంబి శ్రీకాంత్; ఆండర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో ప్రణయ్; ఆంథోని గిన్టింగ్ (ఇండోనేసియా)తో కశ్యప్ తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అకానె యామగుచి (జపాన్)తో సైనా నెహ్వాల్; నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)తో పీవీ సింధు ఆడతారు. -
సింధు శుభారంభం
ఫుజౌ (చైనా): ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చైనా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–13, 21–19తో ప్రపంచ 30వ ర్యాంకర్ ఎవగెనియా కొసెత్స్‌కోవా (రష్యా)పై గెలిచింది. తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన సింధుకు రెండో గేమ్‌లో గట్టిపోటీనే ఎదురైంది. అయితే కీలకదశలో సింధు పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ బుసానన్ ఒంగ్‌బామ్‌రంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో మను అత్రి–సుమీత్ రెడ్డి (భారత్) ద్వయం 16–21, 25–27తో కిమ్ యాస్‌ట్రప్–ఆండర్స్ రస్‌ముసేన్ (డెన్మార్క్) జోడీ చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 19–21, 21–15, 17–21తో షిహో తనక–కొహారో యోనెమోటో (జపాన్) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. -
సెమీస్‌లో ఓడిన సాత్విక్–చిరాగ్ జంట
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత కథ ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 12–21, 24–26తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జోడీ కెవిన్ సుకముల్జో–మార్కస్ గిడియోన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయింది. శుక్రవారం ఆలస్యంగా ముగిసిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ 16–21, 19–21తో ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. మొమోటా చేతిలో శ్రీకాంత్‌కిది వరుసగా ఏడో ఓటమి కావడం గమనార్హం. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ పీవీ సింధు 13–21, 16–21తో ఏడో సీడ్ హి బింగ్జియావో (చైనా) చేతిలో పరాజయం పాలైంది. -
సాత్విక్–అశ్విని జంట సంచలనం
చాంగ్జౌ (చైనా): అంతర్జాతీయ బ్యాడ్మింటన్ డబుల్స్‌లో భారత జోడీ మరో సంచలనం సృష్టించింది. చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప ద్వయం ప్రపంచ 12వ ర్యాంక్ జోడీ లారెన్ స్మిత్–మార్కస్ ఇలిస్ (ఇంగ్లండ్)ను బోల్తా కొట్టించింది. బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 25వ ర్యాంక్ జంట సాత్విక్–అశ్విని 21–13, 20–22, 21–17తో ఈ ఏడాది గోల్డ్కోస్ట్కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం నెగ్గిన లారెస్ స్మిత్–మార్కస్ ఇలిస్ జోడీని ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గతంలో ఈ జంటతో ఆడిన రెండుసార్లూ ఓడిపోయిన భారత జోడీ మూడో ప్రయత్నంలో విజయం రుచి చూడటం విశేషం. అయితే పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 19–21, 20–22తో గో వీ షెమ్–తాన్ వీ కియోంగ్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్పప్ప ద్వయం 10–21, 18–21తో కిమ్ సో యోంగ్–కాంగ్ హీ యోంగ్ (దక్షిణ కొరియా) జంట చేతిలో ఓటమి పాలైంది. ప్రణయ్ పరాజయం పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. తొలి రౌండ్లో ఏడో సీడ్ కిడాంబి శ్రీకాంత్ 21–9, 21–19తో రాస్ముస్ జెమ్కే (డెన్మార్క్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... మరో మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 16–21, 12–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో బుసానన్ (థాయ్‌లాండ్)తో పీవీ సింధు; సుపన్యు అవింగ్‌సనోన్ (థాయ్‌లాండ్)తో శ్రీకాంత్; జెంగ్ సివె–హువాంగ్ యాకియోంగ్ (చైనా)లతో సాత్విక్–అశ్విని; మథియాస్ క్రిస్టియాన్సన్–క్రిస్టినా పెడర్సన్ (డెన్మార్క్)లతో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; చెన్ హంగ్ లింగ్–వాంగ్ చి లిన్ (చైనీస్ తైపీ)లతో సుమీత్ రెడ్డి–మనూ అత్రి తలపడతారు. ►ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
భారత్‌కు నిరాశ
గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): కీలకదశలో తడబాటుకు లోనైన భారత జట్టు సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను ఓటమితో ప్రారంభించింది. సోమవారం జరిగిన గ్రూప్1–డి తొలి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 1–4 తేడాతో డెన్మార్క్ చేతిలో పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ పీవీ సింధు విజయం మినహా... మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో భారత్‌కు ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప ద్వయం 15–21, 21–16, 17–21తో జోకిమ్ ఫిషెర్ నీల్సన్–క్రిస్టినా పెడర్సన్ జంట చేతిలో ఓడింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ అజయ్ జయరామ్ కేవలం 27 నిమిషాల్లో 12–21, 7–21తో ప్రపంచ మూడో ర్యాంకర్ విక్టర్ అక్సెల్సన్ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి జంట 17–21, 15–21తో మథియాస్ బో–కార్స్టెన్ మోగెన్సన్ జోడీ చేతిలో ఓడటంతో భారత పరాజయం ఖాయమైంది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన నామమాత్రమైన మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 21–18, 21–6తో లైన్ జార్‌ఫెల్ట్‌ను ఓడించడంతో భారత్ బోణీ చేసింది. చివరిదైన ఐదో మ్యాచ్‌గా జరిగిన మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ 21–18, 15–21, 21–23తో కామిల్లా రైటర్ జుల్–క్రిస్టినా పెడర్సన్ జంట చేతిలో ఓడిపోయింది. భారత జట్టుకు నాకౌట్‌కు అర్హత సాధించే అవకాశాలు సజీవంగా ఉండాలంటే నేడు (మంగళవారం) ఇండోనేసియా జట్టుతో జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి.