
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుల కథ ముగిసింది. పురుషుల డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్స్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీకి ప్రిక్వార్టర్ ఫైనల్లో చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ పీవీ సింధు గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో వైదొలిగింది.
డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 23–25, 21–19, 19–21తో మొహమ్మద్ అహసాన్–హెంద్రా సెతియవాన్ (ఇండోనేసియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. సుపనిద కటెథోంగ్ (థాయ్‌లాండ్)తో జరిగిన మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను 21–18తో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో స్కోరు 1–1 వద్ద సింధు మోకాలికి గాయం కావడంతో ఆమె మ్యాచ్ నుంచి వైదొలిగింది.
Comments
Please login to add a commentAdd a comment