పారిస్: ప్రపంచ నెం.1, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో అలవోకగా క్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. సోమవారం పురుషుల సింగిల్స్‌లో జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో జకోవిచ్ 6–3, 6–2, 6–2తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్(జర్మనీ)ని చిత్తు చేశాడు. గంటా 36 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో జకోవిచ్ 6 ఏస్‌లు సంధించి, 3 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 31 విన్నర్లు కొట్టి, 12 అనవసర తప్పిదాలు చేశాడు. సుదీర్ఘంగా జరిగిన మరో మ్యాచ్‌లో నిషికొరి(జపాన్) 6–2, 6–7(8/10), 6–2, 6–7(8/10), 7–5తో బెనాయిట్ పైర్(ఫ్రాన్స్)పై చెమటోడ్చి నెగ్గాడు.
దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ మారథాన్ పోరులో ఏడో సీడ్ నిషికోరికి 38వ ర్యాంకర్ అయిన ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తొలి, మూడవ సెట్లను నిషికోరి దక్కించుకోగా, టైబ్రేక్‌కు దారితీసిన రెండు, నాలుగు సెట్‌లు పైర్ వశమయ్యాయి. నిర్ణయాత్మక ఐదో సెట్‌లోనూ పోరు హోరాహోరీ సాగింది. పాయింట్ పాయింట్‌కూ ఇద్దరూ చెమటోడ్చారు.
చివరి ఈ సెట్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకున్న నిషికోరి తదుపరి రౌండ్‌లో రెండో సీడ్ నాదల్‌తో తలపడతాడు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 14వ ర్యాంకర్ మాడిసన్ కీస్(అమెరికా) 6–2, 6–4తో సినియకోవా(చెక్‌రిపబ్లిక్)ను వరుస సెట్లలో చిత్తు చేసి క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకుంది. మరో మ్యాచ్‌లో సోఫియా కెనిన్(అమెరికా)ను 3–6, 6–3, 0–6తో ఇంటిబాట పట్టించిన ఎనిమిదో సీడ్ ఆష్లే బార్టీ(ఆస్ట్రేలియా)తో తదుపరి రౌండ్‌లో మాడిసన్ కీస్‌తో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment