![French Open Naomi Osaka Fined Over Press Meet Boycott - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/31/Osaka_Fined_French_Open.jpg.webp?itok=_6KNz_kM)
పారిస్: జపనీస్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ నయోమి ఒసాకా చెప్పినట్లే చేసింది. ఫ్రెంచ్ టోర్నీలో భాగంగా మ్యాచ్ తర్వాత ప్రెస్మీట్లో పాల్గొనకుండా వెళ్లిపోయింది. దీంతో మ్యాచ్ రిఫరీ ఆమెకు ఫైన్ విధించడంతో పాటు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకపోతే టోర్నీ నుంచి డిస్క్వాలిఫై చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాగా, రూల్స్ తెలిసి కూడా ప్రెస్‌మీట్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ఒసాకా ఇది వరకు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో భాగంగా ఆదివారం రొమేనియన్ ప్లేయర్ ప్యాట్రికాతో మ్యాచ్ తర్వాత(ఒసాకానే గెలిచింది) ఆమె మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయింది. దీంతో ఈ వరల్డ్ నెంబర్ టు ర్యాంకర్‌కి 15 వేల డాలర్ల జరిమానా విధించారు. అంతేకాదు మళ్లీ ఇలా జరిగితే అనర్హత వేటు తప్పదని మ్యాచ్ రిఫరీ రొనాల్డ్ గారోస్ హెచ్చరించారు. 23 ఏళ్ల వయసున్న ఒసాకా నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెల్చుకోవడంతో పాటు.. స్పోర్ట్స్‌లో అత్యధికంగా సంపాదించే ఫిమేల్ ప్లేయర్ కూడా.:
చూడండి: నయోమి ఒసాకా ఫొటోలు
మీరేం స్పెషల్ కాదు
ఇక ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభానికి ముందే నయోమి ఒసాకా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లను బాధపెట్టే విధంగా మీడియా అడిగే ప్రశ్నలు తమ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని చెబుతూ ప్రెస్‌మీట్‌ను బాయ్‌కాట్ చేసింది. గ్రాండ్‌స్లామ్ రూల్స్ ప్రకారం.. మీడియా సమావేశాన్ని ఎగ్గొడితే 20 వేల డాలర్లు (సుమారు రూ. 15 లక్షలు) దాకా జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా ఆమె బాయ్‌కాట్ చేయడం నిర్వాహకులకు మరింత కోపం తెప్పించింది. దీంతో మీరేం స్పెషల్ కాదని, నిబంధనలను ఆటగాళ్లందరికీ వర్తిస్తాయని పేర్కొంటూ ‘వింబుల్డన్, ఫ్రెంఛ్ ఓపెన్, ఆస్ట్రేలియన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ నిర్వాహ కమిటీలు సంయుక్తంగా ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. అయితే మ్యాచ్ ముగిశాక ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో ఆమె మీడియాతో ఇంటెరాక్ట్ కావడం విశేషం.
anger is a lack of understanding. change makes people uncomfortable.
— NaomiOsaka大坂なおみ (@naomiosaka) May 30, 2021
Comments
Please login to add a commentAdd a comment