పారిస్: ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ రోజు జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో నాదల్ 6-3,6-4, 6-2 తేడాతో స్విస్ దిగ్గజం ఫెడరర్‌పై గెలిచి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. తొలి సెట్‌ను అవలీలగా గెలుచుకున్న నాదల్.. రెండో సెట్‌లో కాస్త శ్రమించాడు. రెండో సెట్‌లో తొలుత ఫెడరర్ ఆధిక్యంలో నిలిచినప్పటికీ నాదల్ పోరాడి గెలిచాడు. ఇక మూడో సెట్ ఏకపక్షంగా సాగింది. నాదల్ దూకుడుకు ఫెడరర్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. వరుస పాయింట్లు సాధించిన నాదల్ ఆ సెట్‌ను కైవసం చేసుకోవడమే కాకుండా మ్యాచ్‌ను సైతం సొంతం చేసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ఫెడరర్ మూడు ఏస్‌లు సంధించగా, నాదల్ కూడా మూడు ఏస్‌లకే పరిమితమయ్యాడు. ఇక డబుల్ ఫాల్ట్ విషయానికొస్తే తలో తప్పిదం చేశారు. ఇక నాదల్ ఆరు బ్రేక్ పాయింట్లను సాధించగా, ఫెడరర్ రెండు బ్రేక్ పాయింట్లను మాత్రమే సాధించాడు. ఓవరాల్‌గా నాదల్ 102 పాయింట్లను గెలవగా, ఫెడరర్ 79 పాయింట్లను గెలిచాడు. సర్వీస్ పాయింట్ల విషయంలో నాదల్ హవానే కొనసాగింది. 58 సర్వీస్ పాయింట్లను నాదల్ గెలవగా, 49 సర్వీస్ పాయింట్లకే ఫెడరర్ పరిమితయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment