
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మెయిన్ ‘డ్రా’లో పాల్గొనే దిశగా తెలంగాణ అమ్మాయి షేక్ హుమేరా ముందంజ వేసింది. భారత్‌లో నిర్వహించిన వైల్డ్ కార్డు టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో హుమేరా 7–5, 6–3తో సారా దేవ్‌పై విజయం సాధించింది. ఎనిమిది మంది మధ్య నాకౌట్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో హుమేరా ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజేతగా నిలువడం విశేషం.
పారిస్‌లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ వైల్డ్ కార్డు టోర్నీలో బ్రెజిల్, చైనా క్రీడాకారిణులతో హుమేరా తలపడుతుంది. ఆ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన వారికి ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. బాలుర సింగిల్స్ విభాగంలో మన్ మౌలిక్ షా ఈ అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్లో మన్ 7–6 (7/1), 6–2తో మధ్విన్ కామత్‌పై గెలిచాడు. విజేతలకు ఏడుసార్లు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జస్టిన్ హెనిన్ (బెల్జియం) బహుమతులు అందజేసింది.
Comments
Please login to add a commentAdd a comment