పుతిన్‌పై ప్రశ్న.. రిపోర్టర్‌పై బైడెన్‌ ఆగ్రహం | Joe Biden Anger On Media Reporter In White House | Sakshi
Sakshi News home page

పుతిన్‌పై ప్రశ్న.. రిపోర్టర్‌పై బైడెన్‌ ఆగ్రహం

Published Sat, Sep 14 2024 11:30 AM | Last Updated on Sat, Sep 14 2024 11:51 AM

Joe Biden Anger On Media Reporter In White House

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తాజాగా ఓ మీడియా ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం(సెప్టెంబర్‌13) వైట్‌హౌస్‌లో బైడెన్‌, బ్రిటన్‌ పీఎం కీర్‌ స్టార్‌మర్‌ ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించి బ్రీఫింగ్‌ ఇస్తుండగా స్కై న్యూస్‌ మీడియా ప్రతినిధి ఒకరు బైడెన్‌ను ప్రశ్నించారు.

రష్యాపై ఉక్రెయిన్ లాంగ్‌ రేంజ్‌ క్షిపణులను ప్రయోగించే విషయంలో పశ్చిమ దేశాలకు పుతిన్‌ వార్నింగ్‌ ఇవ్వడాన్ని రిపోర్టర్‌ ప్రస్తావించారు. దీనికి బైడెన్‌ స్పందిస్తూ  నేను మాట్లాడే వరకు మీరు నిశ్శబ్దంగా ఉంటే మంచిది.ముందు నన్నుపూర్తిగా చెప్పనివ్వండని రిపోర్టర్‌పై మండిపడ్డారు. అనంతరం సమావేశం ముగిసిన తర్వాత రిపోర్టర్ బైడెన్‌ను తిరిగి ప్రశ్నించారు.

తాను పుతిన్‌ గురించి అసలు ఆలోచించనని,ఉక్రెయిన్‌తో యుద్ధంలో పుతిన్‌ గెలిచే ఛాన్సే లేదని బైడెన్‌ సమానధానమిచ్చారు.ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు అమెరికా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ లాంగ్‌ రేంజ్‌ క్షిపణుల వినియోగించడంపై అమెరికాకు కొత్త విధానమేమీ లేదని చెప్పారు. 2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా,ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement