
సాక్షి, గుంటూరు: మంగళగిరిలో సాక్షి టీవీ రిపోర్టర్ అభిరామ్‌పై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. న్యూస్ కవరేజీ కోసం వెళ్లిన అభిరామ్‌ని అసభ్య పదజాలంతో దూషించిన పచ్చ పార్టీ నేతలు.. చొక్కా పట్టుకుని కొట్టారు. అతని చైన్ దొంగిలించారు. అక్కడ నుంచి వెళ్లకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. ఇష్టానుసారంగా దాడి చేయడంతో అభిరామ్‌కు గాయాలయ్యాయి. అభిరామ్‌పై దాడిని అడ్డుకోబోయిన మిగతా రిపోర్టర్లపై కూడా టీడీపీ నేతలు జులుం చూపించారు. వారిని నెట్టివేశారు. గాయాలపాలైన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment