
మీరు లేరు.. మీ జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి!
హైదరాబాద్ లోని బషీర్ బాగ్ మీదుగా వెళ్లే సమ యంలో... ప్రస్తుతం ఉన్న లోకాయుక్త కార్యాలయ భవనాన్ని చూసినప్పుడ ల్లా ఆంధ్రపత్రిక కార్యాల యం, అందులో పని చేసి న మహామహులతో సాన్ని హిత్యాలు సముద్రపు అల లలాగా, నదీ తీరాన నిలబడినప్పుడు వినిపించే ప్రవాహపు సవ్వడి లాగా గుర్తుకొచ్చి నన్ను జ్ఞాప కాల మహల్‌లోకి తీసుకెళతాయి. నన్ను శివలెంక రాధాకృష్ణ్ణ గారే స్టాఫ్ రిపోర్టర్‌గా ఎంపిక చేసి నియ మించటం... బషీర్‌బాగ్ భవనంలోనే ఎడిటర్ సీవీ రాజగోపాలరావు, చీఫ్ రిపోర్టర్ పాపయ్య శాస్త్రి గారల వద్ద పని చేయటం.
మహా రచయితలు తిరు మల రామచంద్ర, రామ్‌ప్రసాద్, నిడదవోలు శివ సుందరేశ్వరరావు, ద్రోణంరాజు కృష్ణమోహన్, సం తానం గోపాలరావు, మందరపు లలిత, రామచం ద్రయ్య సహా సీనియర్ జర్నలిస్టులు పాశం యాద గిరి, జొన్నలగడ్డ రాధాకృష్ణ, ప్రభంజన్ (కార్టూ నిస్టు), కడెంపల్లి వేణుగోపాల్, మొక్కరాల వెంకట రత్నం తదితరులతో కలిసి పని చేయడం నా అదృష్టం.. వీరంతా నన్ను ఎంతో ప్రో త్సహించారు, వార్తా రచన విషయంలో మరింత మెరుగులు దిద్దారు. రాజగో పాలరావు, రామ్‌ప్రసాద్, సుందరేశ్వర రావు ఉన్నారంటే అటు ఎడిటోరియల్ డిపార్ట్‌మెంటులో ఇటు రిపోర్టింగ్ సెక్ష న్‌లో సందడే సందడి.
కోట్ల విజయ భాస్కరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు సీఎంలుగా ఉండే రోజు ల్లో ఉదయం 8 గంటలకల్లా సమీక్షా సమావేశాలు ప్రారంభమయ్యేవి. సమాచారాన్ని కవర్ చేసుకొని హడావుడిగా ఆఫీసు చేరుకొని ఈవినింగ్ ఎడిషన్‌కు వార్త రాసేసి గబగబా మరో ఎసైన్‌మెంట్ కవర్ చేసేందుకు బయలుదేరే వాళ్లం. ఈవినింగ్ ఎడిష న్‌కు వార్త ఇచ్చేద్దామని రిపోర్టర్స్ సెక్షన్‌లో కూర్చో వటమే ఆలస్యం... మెలమెల్లగా ఓ టాల్కం పౌడర్ వాసన మా సెక్షన్‌లోకి చొరబడేది. ఆ వెనకే నవ్వు తూ సీవీఆర్ వచ్చేసి ఎదురుగా ఎవరి టేబుల్ ఖాళీగా కనిపిస్తే ఆ టేబుల్‌పై కూర్చొని ‘ఏం స్వామీ, ఫస్ట్ పేజీ కోసం ఏమిస్తున్నారూ...’ అం టూ పలకరించేవారు.
మా ఎడిటర్ సీవీ రాజగోపాలరావు గారిని మేమంతా సీవీ ఆర్ అని పిలుచుకునే వారం. ఫలానా అంశంపై స్టోరీ, ఫలానా ప్రోగ్రాంలో సీఎం మాట్లాడిన విషయంపై వార్త ఇస్తు న్నానని చెప్పగానే త్వరత్వరగా ఇచ్చే యండి అని చెబుతూనే ఆఫీస్ బాయ్‌తో ‘ఇదిగో.. దుర్గారావ్.. విద్యారణ్యగారికి, నాకూ కాఫీ పట్టుకొచ్చేయ్... డెస్క్‌లో రామ్‌ప్రసాద్ గారు వచ్చినట్లున్నారు, ఆయన్ని రమ్మను’ అని ఆర్డ రేసేసే వారు. ‘ఆయనింకా రాలేదండీ’ అని దుర్గా రావ్ జవాబిస్తే ‘అదేంటయ్యా.. ఆఫీస్ వరండాలో చుట్ట వాసన కొడుతుంటేనూ..’ అని నవ్వేసేవారు.. ఈ లోగా రాంప్రసాద్‌గారు కూడా మా సెక్షన్‌లో కొచ్చి కూర్చొని సీవీఆర్ గారితో బాతాఖానీ వేసే వారు.
ఆ బాతాఖానీలో తెలుగు జర్నలిజం చరిత్ర, తెలుగు సాహిత్యం, ఆనాటి రాజకీయాలపై విశ్లేషణ చోటు చేసుకునేవి. మధ్య మధ్యలో సీవీఆర్‌గారు జోక్యం చేసుకుని ‘విద్యారణ్యగారూ, ఎప్పుైడైనా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై నిష్పాక్షికంగా రాయండి... వార్తా రచనలో పదాలను ఆచి తూచి ఉపయోగించాలి’ అంటూ నిర్దేశించేవారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి ప్రజాపత్రి కలో విలేకరి/ఉప సంపాదకుడిగా ఉద్యోగంలో చేరి న సీవీఆర్ ఆ తర్వాత ఆంధ్రపత్రికలో చేరి ఎడిటర్ స్థాయికి చేరుకున్నారు. ఎంతటి తీవ్ర సమస్య అయి నా సంయమనాన్ని పాటించి, విశ్లేషించి విలేకరుల తో రాయించటం, అందుకు తగ్గట్టు అద్భుతమైన శీర్షికలు పెట్టడం సీవీఆర్‌గారి స్టైల్.
నాటి సీఎం ఎన్టీ ఆర్, ఎన్నికల్లో ఆనాటి ప్రముఖుడు ఆరేటి కోటయ్య కు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. మరుసటి రోజు మిగతా తెలుగు పత్రికలలో ‘కోటయ్యకు టికె ట్ లేదు. కోటయ్యకు చెయ్యిచ్చిన ఎన్టీఆర్’ లాంటి శీర్షికలతో వార్తలొచ్చాయి. అయితే ఆంధ్రపత్రికలో వచ్చిన వార్తా శీర్షిక ‘‘కోటయ్యకు ఎన్టీఆర్ ‘నమస్కా రం’-టికెట్‌కు బదులు ఆర్టీసీ ఛైర్మన్ పదవి’’ అని. కలం పట్టిన వాడు నిజాయితీగా నిబద్ధతతో పనిచే యాలేగాని, సెన్సేషన్ సృష్టించడం కోసం తన రాత లతో ఎవరినీ హర్ట్ చేయకూడదంటారు సీవీఆర్.
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు)
ఈమెయిల్: vidyaranyahgmail.com