Andhrapatrika
-
దేశోద్ధారకుడు
‘ఆంధ్రపత్రిక నడపడమంటే పెద్ద తలనొప్పి సుమండీ!’ అన్నారట కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు. ‘పరవాలేదు. అమృతాంజనం కూడా మీదే కదా!’ అని చమత్కరించారట రాజాజీ. భారతీయ పత్రికలను బ్రిటిష్ ప్రభుత్వం వెంటాడుతున్న కాలమది. అలాగే స్వాతంత్య్రోద్యమాన్ని కర్కశంగా అణచివేస్తున్న సమయం కూడా అదే. ఆ సమయంలో ఇటు పత్రికా నిర్వహణలోను, అటు స్వరాజ్య సమరంలోను కీలకంగా నిలిచినవారు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు. ఆయన స్థాపించిన ఆంధ్రపత్రిక తెలుగువారి ఉద్యమానికి, సంస్కృతికి, సాహిత్యాభిలాషకి అద్దం పట్టింది. తలనొప్పి – అమృతాంజనం జంటపదాలైనాయి. ఎన్నో పత్రికలు రావచ్చు. పోవచ్చు. కానీ ఆంధ్రపత్రికకు ఉన్న స్థానం చరిత్రలో మరొక పత్రికకు రాలేదు. అలాగే తలనొప్పికి అమృతాంజనమే ఈరోజుకీ దివ్యౌషధం. భారత స్వాతంత్య్ర సమరం పదునెక్కుతున్న సంగతిని గమనించి అందుకు సంబంధించిన వార్తలను తెలుగులో అందించాలన్న ఆశయంతో ఆంధ్రపత్రికను స్థాపించారు పంతులుగారు. ఆయన స్వయంగా స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. 1838 ప్రాంతంలో తెలుగులో పత్రికల ప్రచురణ (వృత్తాంతి) ప్రారంభమైనప్పటికీ ఆంధ్రపత్రిక వచ్చే వరకు వాటికి పూర్తి స్వరూపం రాలేదంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రపత్రిక ఆవిర్భవించిన నాటికి గట్టుపల్లి శేషాచార్యులు అనే పండితుడు మద్రాసు నుంచి వెలువరిస్తున్న ‘శశిలేఖ’, ఏపీ పార్థసారథినాయుడు (ఇది కూడా మద్రాసులోనే∙అచ్చయ్యేది) నిర్వహిస్తున్న ‘ఆంధ్రప్రకాశిక’, కొండా వెంకటప్పయ్య తదితరులు మచిలీపట్నం నుంచి ప్రచురిస్తున్న ‘కృష్ణాపత్రిక’ ప్రధానంగా ఉండేవి. మొదటి ప్రపంచ యుద్ధం వార్తలు కూడా తెలుగువారికి తెలియాలన్న ఉద్దేశం కూడా పంతులుగారికి ఉండేదట. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు (మే 1, 1867–11 ఏప్రిల్, 1938) కృష్ణా జిల్లాలోని ఎలకుర్రులో పుట్టారు. తండ్రి బుచ్చయ్య, తల్లి శ్యామలాంబ. ప్రాథమిక విద్య స్వగ్రామంలోను, తరువాత మచిలీపట్నంలోను పూర్తయింది. ఆ చదువు చాలునని తండ్రి అభిప్రాయం. కొడుకు చదువులు, ఉద్యోగాల పేరుతో వేరే ఊళ్లో ఉండడం ఆయనకు ఇష్టం లేదు. కానీ ఆ తల్లి మాత్రం కొడుకు పెద్ద చదువులు చదవాలని పట్టుపట్టి మద్రాసు పంపింది. అక్కడే ఆయన క్రిస్టియన్ కాలేజీలో బీఏలో చేరారు. కానీ ఎందుకో మరి, మధ్యలోనే చదువు విడిచిపెట్టేశారు. అక్కడ ఉండగానే రెంటాల సుబ్బారావు అనే ప్రముఖ న్యాయవాదితో పరిచయం ఏర్పడింది. ఆయన కోరిక మేరకు ఆయన మేనకోడలు రామాయమ్మను పంతులుగారు వివాహం చేసుకోవడానికి అంగీకరించారు. ఇందుకు ఆయన తల్లి అంగీకరించలేదు. పెళ్లికి కూడా రాలేదు. 1890 సంవత్సరంలో పెళ్లి జరిగింది. సుబ్బారావుగారు న్యాయవాది మాత్రమే కాదు. వ్యాపారవేత్త. అక్కడే కాబోలు మొదట పంతులుగారిలో వ్యాపారం చేయాలన్న ఆశయం అంకురించింది.అందుకే కాబోలు ఏ ఉద్యోగంలోను చేరలేదు. బొంబాయి వెళతానని చెప్పారు తల్లికి. అందుకు కూడా ఆమె అంగీకరించలేదు. మళ్లీ తల్లి మాట ధిక్కరించి ఆయన వెళ్లారు. 1892 నుంచి రెండేళ్ల పాటు అక్కడే వ్యాపారం చేశారు. తరువాత ఔషధాల వ్యాపారంలో తర్ఫీదు కోసం కలకత్తా వెళ్లారు. మళ్లీ బొంబాయి చేరుకున్నారు. అక్కడే విలియం అండ్ కో సంస్థలో చేరారు. అది ఐరోపా వారి సంస్థ. ఆ యజమాని అభిమానానికి పంతులుగారు పాత్రులయ్యారు. అదే వరమైంది. ఆ సంస్థ యజమాని స్వదేశం వెళ్లిపోవాలని అనుకున్నాడు. వ్యాపారం మొత్తం పంతులుగారికి అప్పగించి వెళ్లిపోయాడు. ఆ వ్యాపారం చేతికి వచ్చాకనే 1899లో పంతులుగారు అమృతాంజనం తయారు చేయడం ఆరంభించారు. 1903 నాటికి ఆ వ్యాపారం ఇతోధికంగా పెరిగిపోయింది. విదేశాలకు కూడా ఎగుమతి అయ్యేది. అప్పుడే లక్షలలో ధనం వచ్చిపడింది. తన మందుల దుకాణానికి ‘అమృతాంజనం డిపో’ అని పేరు పెట్టారు. బొంబాయి, కలకత్తా – ఈ రెండు నగరాలు స్వాతంత్య్రోద్యమంలో కీలకంగా ఉన్నాయి. అప్పటికే రాజకీయంగా ఎంతో చైతన్యం పొందాయి. కలకత్తా బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంతోను, మహారాష్ట్ర భారత జాతీయ కాంగ్రెస్ ప్రభావంతోను ఉద్యమ వేడితో ఉండేవి. ఆ రెండు నగరాల మధ్యనే పంతులుగారు చిరకాలం తిరిగారు. అందుకే అక్కడి ప్రభావం ఆయన మీద బాగా పడింది. తాను వ్యాపారంలో బాగా రాణించి స్థిరపడిన కాలంలో మహారాష్ట్ర పత్రికలు ఇస్తున్న చైతన్యంతో జాతీయ భావధారంలో ఊగుతూ ఉండేది. తెలుగువారి కోసం కూడా ఆ స్థాయిలో పత్రిక నిర్వహించాలని పంతులుగారు ఆకాంక్షించారు. అందుకే మొదట ఆంధ్రపత్రిక వారపత్రికను బొంబాయిలో 1908లో ఆరంభించారు. అంతకు ముందు సంవత్సరం జరిగిన సూరత్ కాంగ్రెస్ సభలకు ఆయన హాజరయ్యారు. అది ఆయన ఆలోచనను మరింత వేగవంతం చేసింది. 1910లో ఆంధ్రపత్రిక ఉగాది సంచికల ప్రచురణను ఆరంభించారు. ఆ సంచికలు ఇప్పటికీ తెలుగు ప్రాంతంలోని కొన్ని గ్రంథాలయాలలో లభ్యమవుతాయి. వాటిని చదవడం నిజంగా గొప్ప అనుభవం.అందులో ‘ప్రస్తావన’ పేరుతో ఒక శీర్షిక ఉండేది. అచ్చులో కనీసం నలభై యాభై పేజీలకు తక్కువ కాకుండా ఉండేది. దానిని స్వయంగా పంతులుగారే రాసేవారు. ప్రపంచ యుద్ధకాలంలో కూడా ఈ శీర్షిక దర్శనమిచ్చేది. అయితే కొన్ని పేజీలు తక్కువగా ఉండేవి. న్యూస్ ప్రింట్ కొరత కారణంగా అన్ని పేజీలు ఇవ్వలేకపోతున్నామని ‘గమనిక’లో వాపోయేవారు. ఈ శీర్షిక ప్రపంచం మొత్తం మీద ఒక విహంగ వీక్షణం. వివిధ ప్రపంచ దేశాల విశేషాలు, భారత స్వాతంత్య్రోద్యమం, తెలుగు ప్రాంతం, అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ వివరాలు అన్నీ అందులో ఉండేవి. ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిణామాలు మొత్తం ఆయన ఇందులో విశ్లేషించేవారు. ఆయన 28 ఏళ్ల పాటు ఆ శీర్షిక నిర్వహించారు. అంటే తుదిశ్వాస విడిచేవరకు. కానీ తెలుగువారు బాగా తక్కువగా ఉన్న బొంబాయిలో ఆయన ఇమడలేకపోయారని అనిపిస్తుంది. వ్యాపారం, కుటుంబం, పత్రిక మద్రాసు తరలించాలన్న ఆలోచనకు వచ్చారు. సూరత్ సభలకు వెళుతూ గిర్గావ్లో ఉన్న పంతులుగారి ఇంటిని ఆనాడు అవటపల్లి నారాయణరావు గారు ఇంకొందరు సందర్శించారు. ఈ అనుభవాన్ని, పంతులుగారి ఆతిథ్యం గురించి అవటపల్లి ఒక వ్యాసంలో చక్కగా వర్ణించారు.భారత స్వాతంత్య్రోద్యమాన్ని అక్షరాలలో దర్శించే భాగ్యమైనా కలిగించినవారు పంతులుగారే. మారుమూల గ్రామాలకు కూడా ఆంధ్రపత్రిక తపాలా శాఖ ద్వారా బట్వాడా అయ్యేది. మద్రాస్ చేరుకున్న తరువాత 1914లో ఆంధ్రపత్రిక దినపత్రికను ఆరంభించారు. మరోపక్క వార పత్రిక కూడా వెలువడేది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం, ఆంధ్రపత్రిక ఒకే సంవత్సరంలో ఆరంభమైనాయి. పత్రికా నిర్వహణ భారమనుకుంటూనే మరోపక్క ఆంధ్రగ్రంథమాల అనే సంస్థను స్థాపించారు. స్వయంగా తమ రచనలు ముద్రించుకోలేని ఎందరో రచయితల పుస్తకాలను అచ్చువేయించే పనిని పంతులుగారే చేపట్టారు. బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, భగవద్గీతా వ్యాఖ్యానం కూడా అచ్చు వేయించారు. ఇందులో భగవద్గీతా వ్యాఖ్యానం ఆయన జైలుకు వెళ్లినప్పుడు స్వయంగా రాసినదే. ఇదంతా ఉచితంగా చేశారాయన.కొమర్రాజు లక్ష్మణరావు పంతులుగారు అసంపూర్ణంగా వదిలేసిన ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం ప్రచురణ భారాన్ని కూడా నాగేశ్వరరావుగారే తలకెత్తుకున్నారు. ఇవి కాక, ఆయన చెన్నపట్నంలో తన కార్యాలయం బయటకు వస్తే చాలు కనీసం అయిదారుగురు అక్కడ వేచి ఉండేవారట. ఒకరు కన్నీళ్లతో తన కూతురు పెళ్లికి డబ్బు సాయం చేయమని అడిగేవారట. ఇంకొకరు తాను రాసిన పుస్తకం అచ్చు వేయించుకునే శక్తి లేదని దీనంగా చెప్పేవారట. ఒక విద్యార్థి పరీక్షకో, ఫీజుకో సాయం చేయమనే వారట. మరొకరు మరొక కారణం– అయితే అందరికీ కూడా ఆయన డబ్బు ఇచ్చి పంపేవారు. వారి బాధ తన బాధగా భావించి ఒక ఉద్వేగంతో ఆయన డబ్బు ఇచ్చేవారని ఆయన జీవిత చరిత్ర రాసినవారు పేర్కొనడం విశేషం. ఆయనకు గాంధీజీయే ‘విశ్వదాత’ అన్న బిరుదును ఇచ్చి గౌరవించారు. దేశోద్ధారక ఆయనకు ఉన్న మరొక బిరుదు. పంతులుగారు గాంధీగారి కంటే ముందే హరిజనోద్ధరణ కార్యక్రమం చేపట్టారు. తన సొంతూరులో తల్లి శ్యామలాంబగారి పేరుతో ఒక విద్యాలయాన్ని నెలకొల్పి అందులో హరిజన బాలబాలికలకు అవకాశం కల్పించిన మహనీయుడు. వారి దీనస్థితికి చింతిస్తూ రెండెకరాల భూమి కొని అందులో నలభై ఇళ్లను నిర్మించి ఇచ్చారాయన. 1932లో ఆవిర్భవించిన ఆంధ్ర రాష్ట్ర హరిజన సేవా సంఘానికి ఆయన అధ్యక్షులు కూడా. హిందీ ప్రచారం, ఖద్దరు ఉద్యమం పంతులుగారి జీవితంలో కనిపించే మరో రెండు కోణాలు. 1923లో కాకినాడలో జాతీయ కాంగ్రెస్ సభలు జరిగినప్పుడే హిందీ సాహిత్య సమ్మేళనం కూడా జరిగింది. ఆ సభలకు పంతులుగారే ఆహ్వాన సంఘాధ్యక్షులు. విజయవాడలోని నాగేశ్వరరాయ హిందీ భవన్ ఆయన చలవతో ఏర్పడినదే. అలాగే గ్రంథాలయోద్యమంలో కూడా ఎంతో చురుకుగా పాల్గొన్నారు. ఎంత చిన్న గ్రంథాలయమైనా దానికి ఆంధ్రపత్రికను ఉచితంగా పంపేవారాయన. 1919లో మద్రాసులోని గోఖలే హాలులో జరిగిన అఖిల భారత గ్రంథాలయ సభకీ, ఆంధ్ర సారస్వత సభలకు కూడా ఆయనే సారథి. 1924 సంవత్సరంలో ఆయన ‘భారతి’ మాస పత్రికను నెలకొల్పారు. ఇది ఒక అత్యున్నత అభిరుచికి తార్కాణంగా కనిపిస్తుంది. ప్రతి సంచిక ఒక ఆణిముత్యమే. సాహిత్యం, చరిత్ర, పురావస్తు శాస్త్రం, అర్థశాస్త్రం, రాజనీతి ఒకటేమిటి– ప్రతి విశిష్ట అంశాన్ని ‘భారతి’లో పాఠకులు దర్శించేవారు. తెలుగు సాహిత్యానికి ఈ పత్రిక చేసిన సేవ వెలకట్టలేనిది. ఇవన్నీ ఉన్నా స్వాతంత్య్రోద్యమం, ఆం్ర«ధోద్యమం కూడా పంతులుగారి జీవితంలో కీలకంగానే కనిపిస్తాయి. ఆంధ్రరాష్ట్ర అవతరణకు కీలక ఒప్పందం జరిగిన శ్రీబాగ్ మద్రాసులో పంతులుగారి నివాసమే. 1924, 1929, 1930, 1934 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు కూడా పంతులుగారే.పంతులుగారి కృషిని అంచనా వేయడం అంత సులభం కాదు. ఆయన పత్రికా నిర్వాహకుడు. స్వయంగా పత్రికా రచయిత. కళోద్ధారకుడు. చిన్నప్పుడు స్వయంగా నాటకాలలో నటించిన అభిమానం ఆయనకు జీవితాంతం ఉండిపోయింది. అందుకే నాటక కళకు కూడా ఆయన సేవలు దక్కాయి. వీటితో పాటు జీర్ణదేవాలయోద్ధరణ ఇంకొకటి. కాశీనాథుని నాగేశ్వరరావు వంటివారు చరిత్రలో అరుదుగా కనిపిస్తారు. ఆయన తెలుగువాడు కావడం నిజంగానే గర్వకారణం. ∙డా. గోపరాజు నారాయణరావు -
పత్రికలు సంచలనాలకు దూరంగా ఉండాలి
ఆంధ్రపత్రిక పునఃప్రారంభ కార్యక్రమంలో వెంకయ్య సూచన సాక్షి, విజయవాడ: పత్రికలు సత్యాలకు దగ్గరగా.. సంచలనాలకు దూరంగా ఉండాలని ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు సూచించారు. విజయవాడ ఐవీప్యాలెస్‌లో ఆంధ్రపత్రిక దినపత్రిక కృష్ణా జిల్లా ఎడిషన్‌ను ఆయన శనివారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పత్రికలు స్వేచ్ఛ, హక్కులతో పాటు బాధ్యతలను గుర్తుంచుకోవాలన్నారు. జాతీయ ఉద్యమంలో అర్ధ శతాబ్దం పాటు ప్రజలను జాగృతం చేసిన ఆంధ్రపత్రిక 1991లో అనివార్య కారణాల వల్ల మూతపడిందన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును ఇంటర్వ్యూ చేసిన ఘనత ఆంధ్రపత్రికకు దక్కుతుందన్నారు. కాగా విజయవాడలోని రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) కార్యాలయాన్ని శనివారం వెంకయ్యనాయుడు సందర్శించి అక్కడి వారితో మాట్లాడారు. -
తెలుగుజాతి మణిపూస కాశీనాథుని
విజయవాడ కల్చరల్: తెలుగుజాతి మణిపూస కాశీనాథుని నాగేశ్వరరావు పంతులని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కేంద్రసాహిత్య అకాడమీ, కృష్ణా విశ్వవిద్యాలయం, కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయుక్తంగా ఆంధ్రపత్రిక, భారతి పత్రికల సాహిత్యసేవ అంశంగా కార్యక్రమాన్ని నిర్వహించాయి. మండలి మాట్లాడుతూ ఆంధ్రపత్రిక, భారతి పత్రికలను దాని వ్యవస్థాపకుడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులును వేరుగా చూడలేమని తెలుగవారి సాహితీ గుండెచప్పుడు ఆయనదని అభివర్ణించారు. నాటి తెలుగువారిలో స్వాత్రంత్య్ర కాంక్షను, పత్రికలు అంతగాలేని రోజుల్లోనే తెలుగుపాఠకులలో చదువుల పట్ల ఆసక్తిని కలిగించాయని అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ అకాడమీ మరుగున పడిన సాహిత్య నిర్మాతల జీవితాల ఆధారంగా అనేక పుస్తకాలను ప్రచురించిందని వివరించారు. సాహిత్య అకాడమీ తెలుగు సలహామండలి సంచాలకులు డాక్టర్ ఎన్.గోపి భారతి సాహిత్యపత్రిక సేవలను వివరిస్తూ ఆ పత్రికతో తన అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. సాహిత్య అకాడమీ తెలుగు సలహామండలి సభ్యుడు పాపినేని శివశంకర్, డాక్టర్ జీవీ పూర్ణచంద్లు ఆంధ్రపత్రిక సాహితీసేవలను వివరించారు. -
మీరు లేరు.. మీ జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి!
హైదరాబాద్ లోని బషీర్ బాగ్ మీదుగా వెళ్లే సమ యంలో... ప్రస్తుతం ఉన్న లోకాయుక్త కార్యాలయ భవనాన్ని చూసినప్పుడ ల్లా ఆంధ్రపత్రిక కార్యాల యం, అందులో పని చేసి న మహామహులతో సాన్ని హిత్యాలు సముద్రపు అల లలాగా, నదీ తీరాన నిలబడినప్పుడు వినిపించే ప్రవాహపు సవ్వడి లాగా గుర్తుకొచ్చి నన్ను జ్ఞాప కాల మహల్లోకి తీసుకెళతాయి. నన్ను శివలెంక రాధాకృష్ణ్ణ గారే స్టాఫ్ రిపోర్టర్‌గా ఎంపిక చేసి నియ మించటం... బషీర్‌బాగ్ భవనంలోనే ఎడిటర్ సీవీ రాజగోపాలరావు, చీఫ్ రిపోర్టర్ పాపయ్య శాస్త్రి గారల వద్ద పని చేయటం. మహా రచయితలు తిరు మల రామచంద్ర, రామ్‌ప్రసాద్, నిడదవోలు శివ సుందరేశ్వరరావు, ద్రోణంరాజు కృష్ణమోహన్, సం తానం గోపాలరావు, మందరపు లలిత, రామచం ద్రయ్య సహా సీనియర్ జర్నలిస్టులు పాశం యాద గిరి, జొన్నలగడ్డ రాధాకృష్ణ, ప్రభంజన్ (కార్టూ నిస్టు), కడెంపల్లి వేణుగోపాల్, మొక్కరాల వెంకట రత్నం తదితరులతో కలిసి పని చేయడం నా అదృష్టం.. వీరంతా నన్ను ఎంతో ప్రో త్సహించారు, వార్తా రచన విషయంలో మరింత మెరుగులు దిద్దారు. రాజగో పాలరావు, రామ్‌ప్రసాద్, సుందరేశ్వర రావు ఉన్నారంటే అటు ఎడిటోరియల్ డిపార్ట్మెంటులో ఇటు రిపోర్టింగ్ సెక్ష న్లో సందడే సందడి. కోట్ల విజయ భాస్కరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు సీఎంలుగా ఉండే రోజు ల్లో ఉదయం 8 గంటలకల్లా సమీక్షా సమావేశాలు ప్రారంభమయ్యేవి. సమాచారాన్ని కవర్ చేసుకొని హడావుడిగా ఆఫీసు చేరుకొని ఈవినింగ్ ఎడిషన్‌కు వార్త రాసేసి గబగబా మరో ఎసైన్మెంట్ కవర్ చేసేందుకు బయలుదేరే వాళ్లం. ఈవినింగ్ ఎడిష న్కు వార్త ఇచ్చేద్దామని రిపోర్టర్స్ సెక్షన్లో కూర్చో వటమే ఆలస్యం... మెలమెల్లగా ఓ టాల్కం పౌడర్ వాసన మా సెక్షన్లోకి చొరబడేది. ఆ వెనకే నవ్వు తూ సీవీఆర్ వచ్చేసి ఎదురుగా ఎవరి టేబుల్ ఖాళీగా కనిపిస్తే ఆ టేబుల్‌పై కూర్చొని ‘ఏం స్వామీ, ఫస్ట్ పేజీ కోసం ఏమిస్తున్నారూ...’ అం టూ పలకరించేవారు. మా ఎడిటర్ సీవీ రాజగోపాలరావు గారిని మేమంతా సీవీ ఆర్ అని పిలుచుకునే వారం. ఫలానా అంశంపై స్టోరీ, ఫలానా ప్రోగ్రాంలో సీఎం మాట్లాడిన విషయంపై వార్త ఇస్తు న్నానని చెప్పగానే త్వరత్వరగా ఇచ్చే యండి అని చెబుతూనే ఆఫీస్ బాయ్‌తో ‘ఇదిగో.. దుర్గారావ్.. విద్యారణ్యగారికి, నాకూ కాఫీ పట్టుకొచ్చేయ్... డెస్క్‌లో రామ్‌ప్రసాద్ గారు వచ్చినట్లున్నారు, ఆయన్ని రమ్మను’ అని ఆర్డ రేసేసే వారు. ‘ఆయనింకా రాలేదండీ’ అని దుర్గా రావ్ జవాబిస్తే ‘అదేంటయ్యా.. ఆఫీస్ వరండాలో చుట్ట వాసన కొడుతుంటేనూ..’ అని నవ్వేసేవారు.. ఈ లోగా రాంప్రసాద్‌గారు కూడా మా సెక్షన్లో కొచ్చి కూర్చొని సీవీఆర్ గారితో బాతాఖానీ వేసే వారు. ఆ బాతాఖానీలో తెలుగు జర్నలిజం చరిత్ర, తెలుగు సాహిత్యం, ఆనాటి రాజకీయాలపై విశ్లేషణ చోటు చేసుకునేవి. మధ్య మధ్యలో సీవీఆర్గారు జోక్యం చేసుకుని ‘విద్యారణ్యగారూ, ఎప్పుైడైనా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై నిష్పాక్షికంగా రాయండి... వార్తా రచనలో పదాలను ఆచి తూచి ఉపయోగించాలి’ అంటూ నిర్దేశించేవారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి ప్రజాపత్రి కలో విలేకరి/ఉప సంపాదకుడిగా ఉద్యోగంలో చేరి న సీవీఆర్ ఆ తర్వాత ఆంధ్రపత్రికలో చేరి ఎడిటర్ స్థాయికి చేరుకున్నారు. ఎంతటి తీవ్ర సమస్య అయి నా సంయమనాన్ని పాటించి, విశ్లేషించి విలేకరుల తో రాయించటం, అందుకు తగ్గట్టు అద్భుతమైన శీర్షికలు పెట్టడం సీవీఆర్గారి స్టైల్. నాటి సీఎం ఎన్టీ ఆర్, ఎన్నికల్లో ఆనాటి ప్రముఖుడు ఆరేటి కోటయ్య కు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. మరుసటి రోజు మిగతా తెలుగు పత్రికలలో ‘కోటయ్యకు టికె ట్ లేదు. కోటయ్యకు చెయ్యిచ్చిన ఎన్టీఆర్’ లాంటి శీర్షికలతో వార్తలొచ్చాయి. అయితే ఆంధ్రపత్రికలో వచ్చిన వార్తా శీర్షిక ‘‘కోటయ్యకు ఎన్టీఆర్ ‘నమస్కా రం’-టికెట్‌కు బదులు ఆర్టీసీ ఛైర్మన్ పదవి’’ అని. కలం పట్టిన వాడు నిజాయితీగా నిబద్ధతతో పనిచే యాలేగాని, సెన్సేషన్ సృష్టించడం కోసం తన రాత లతో ఎవరినీ హర్ట్ చేయకూడదంటారు సీవీఆర్. (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు) ఈమెయిల్: vidyaranyahgmail.com -
ఆంధ్రోద్యమం
ఆంధ్రోద్యమానికి నాంది గుంటూరులో జరిగిన ఒక చిన్న సంఘటన అని చరిత్రకారులు చెబుతారు. 1911లో గుంటూరు సబ్‌జడ్జి ఒకాయన కోర్టులో దఫేదారు ఉద్యోగానికి అర్హత గల తెలుగువాళ్లు ఎందరో ఉన్న తన స్వంతవూరు కుంభకోణం నుండి ఒక తమిళుడిని పిలిపించి ఇచ్చాడట. దాంతో ఒళ్లు మండిన కొందరు విద్యావంతులైన యువకులు ఆంధ్రోద్యమానికి బీజం వేశారట. ఆనాటి పరిస్థితులను ఒకసారి పరిశీలిద్దాం బ్రిటిష్ పాలనలో దేశమంతా పరుల కింద అణుగుతుంటే మన తెలుగువాళ్ల స్థితి ఇంకొక మెట్టు కిందే. ఇక నిజాం పాలనలోని తెలంగాణలో పరిస్థితి ఇంకా పదిమెట్లు కిందననే చెప్పాలి. నైజాం రాష్ట్రం జనాభాలో 65 శాతం తెలుగువారైతే ఉన్నతోద్యోగులలో మనవాళ్లు నామమాత్రంగా కూడా లేరు. 1914లో ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో రాసిన వివరాలు ఇలా ఉన్నాయి: ‘నిజాం రాష్ట్రంలో తెలుగువాళ్లు సామాజికంగా ఏ మాత్రమూ ఎదిగినట్లు కనిపించరు. హైకోర్టు జడ్జి పదవికి ఒక్క తెలుగువాడిని కూడా నియోగించలేదు. పెద్ద ఉద్యోగాలలో అయితే లేనే లేరు. చివరికి హైకోర్టు వకీళ్లలో కూడా ఉన్నారనేది అనుమానమే. 1895లో స్థాపించిన లెజిస్లేటివ్ కౌన్సిళ్లలో ఇంత వరకూ ఒక్క తెలుగువాడికి కూడా ప్రాతినిధ్యం ఇవ్వబడలేదు’ ఒక సభగానీ సంఘంగానీ పెట్టుకుని తమ సమస్యలను చర్చించేందుకు, భావ వ్యక్తీకరణకు స్వేచ్ఛ లేదు. కనీసం ఒక గ్రంథాలయమో, పాఠశాలో స్థాపించాలంటే అనుమతి లేదు. ప్రభుత్వ కార్యకలాపాలే కాదు, గ్రామాల్లో వ్యవహారాలు కూడా ఉర్దూ, మరాఠీలలో జరిగేవి. 1921లో తెలంగాణ తెలుగువారిలో అక్షరాశ్యత 3 శాతం కంటే తక్కువ. తెలంగాణతో పోలిస్తే కోస్తా, సీడెడ్ జిల్లాలలో పరిస్థితి కాస్త మెరుగే. వ్యవసాయం, నీటిపారుదల సౌకర్యాలు, రోడ్లు, రైలు మార్గాలు కాస్తో కూస్తో అభివృద్ధి చెందాయి. చదువు సంధ్యలకి అవకాశాలు పెరిగాయి. యూనివర్సిటీ మద్రాసులో ఉన్నా ప్రతి పట్టణంలో ఉన్నత విద్యాలయాలు వెలిశాయి. కానీ ఆంధ్రులకి ఉద్యోగావకాశాలలో చిన్నచూపు ఎదుర్కోక తప్పదు. ఉన్నతోద్యోగాలలో తమిళులదే ప్రాబల్యం. అసలు ఆంధ్రులు వెనుకబడ్డజాతి అనే భావన ఆనాటి తెలుగువాళ్ల రాతల్లో కూడా కనిపిస్తుంది. ఏప్రిల్ 15, 1911 హిందూ పత్రిక ‘లెటర్స్ టూ ది ఎడిటర్’లో ‘తెలుగువాళ్లు వెనుకబడ్డవాళ్లా’ అనే శీర్షికతో వెలువడ్డ ఉత్తరం ఒకటి మొట్టమొదటిసారి తెలుగువారి పరిస్థితిని సంఘంలోని విద్యావంతుల దృష్టికి తెచ్చింది. తమిళుల్లోలాగా తెలుగువారిలో ప్రఖ్యాతి చెందిన వ్యక్తులు లేరని, ఆంధ్రులకి ఒక సంస్కృతీ, నాగరికత లేవని, ఒక తమిళ పెద్దాయన అన్న మాటలకి కోపం వచ్చి రాసిన ఉత్తరం అది. దానికి స్పందిస్తూ దేశాభిమాని పత్రికలో చల్లా శేషగిరిరావు అనే యువకుడు ఉద్యోగాలలో తమిళుల ఆధిక్యతని స్టాటిస్టిక్స్ ద్వారా వివరించాడు. అందులో వివరాలు కొన్ని ఇలా ఉన్నాయి. దాంతో కొంచెం అగ్గి రాజుకుంది. అదే సంవత్సరం డిసెంబర్లో బ్రిటిష్ సామ్రాట్, ఢిల్లీ దర్బారులో హిందీ మాట్లాడే బీహారుకి ప్రత్యేక రాష్ట్రం సమంజసమే అంటూ వైస్రాయ్కి సిఫారసు చేశారు. దానితో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం సమంజసమే కదా అనే భావన బలపడసాగింది. అంతే. సంవత్సరం తిరగకుండా ఆంధ్రమహాసభ ఆవిర్భవించింది. అయితే ఒకేసారి తెలుగువారందరిలో ఏకాభిప్రాయం వచ్చిందనలేము. ప్రత్యేకరాష్ట్రం వద్దన్న ప్రముఖులూ ఎందుకొచ్చిందిలే అని మిన్నకున్నవారూ తమిళులతో మనకు పోటీయా అనుకున్న నిరాశావాదులూ ఉన్నారు. ఈ మధ్యలో జాతీయోద్యమం రంధిలో ఆ విషయమే దాదాపు మర్చిపోయారు. అప్పుడప్పుడూ ఊపొచ్చినా తెలుగు జిల్లాల నుండి మద్రాసుకు వచ్చే ఆదాయాన్ని వదులుకోలేని ప్రభుత్వం నుండి అనేక ఆటంకాలు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం ప్రత్యేక తెలుగు రాష్ట్రానికీ స్వాతంత్రానికీ ముడి పెట్టి వాయిదాలు వేసి వేసి చివరకు పొట్టి శ్రీరాములు ఆత్మర్పణ వల్ల ఆంధ్రరాష్ర్టం 1953లో వచ్చింది.