పత్రికలు సత్యాలకు దగ్గరగా.. సంచలనాలకు దూరంగా ఉండాలని ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు సూచించారు.
జాతీయ ఉద్యమంలో అర్ధ శతాబ్దం పాటు ప్రజలను జాగృతం చేసిన ఆంధ్రపత్రిక 1991లో అనివార్య కారణాల వల్ల మూతపడిందన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును ఇంటర్వ్యూ చేసిన ఘనత ఆంధ్రపత్రికకు దక్కుతుందన్నారు. కాగా విజయవాడలోని రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యాలయాన్ని శనివారం వెంకయ్యనాయుడు సందర్శించి అక్కడి వారితో మాట్లాడారు.