నటి చేయిపట్టి లాగిన రిపోర్టర్.. చెంప చెళ్లు | Kristen Bell slaps reporter on red carpet | Sakshi
Sakshi News home page

నటి చేయిపట్టి లాగిన రిపోర్టర్.. చెంప చెళ్లు

Published Sun, Apr 10 2016 2:54 PM | Last Updated on Wed, Apr 3 2019 9:11 PM

నటి చేయిపట్టి లాగిన రిపోర్టర్.. చెంప చెళ్లు - Sakshi

నటి చేయిపట్టి లాగిన రిపోర్టర్.. చెంప చెళ్లు

లాస్ ఎంజెల్స్: తిక్క ప్రశ్న వేయడమే కాకుండా తన చేయిపట్టి లాగినందుకు ఓ రిపోర్టర్ చెంపను చెళ్లుమనిపించింది ప్రముఖ హాలీవుడ్ నటి క్రిస్టెన్ బెల్.  అతడి ప్రవర్తనను చూసి చిర్రెత్తి పోయింది. ఓ ప్రముఖ వెబ్ సైట్ సేకరించిన వీడియో సమాచారం ప్రకారం ది బాస్ అనే చిత్రం ప్రీమియర్ కార్యక్రమానికి క్రిస్టెన్ బెల్ హాజరైంది. అదే కార్యక్రమానికి వచ్చిన డొనెల్లీ అనే రిపోర్టర్ ఆమె రెడ్ కార్పెట్ పై ఉండగా ముఖానికి దగ్గరగా మైక్ పెట్టి ఇబ్బంది పెట్టేలా, ధ్వంధ్వార్ధం వచ్చేలా ప్రశ్నించాడు.

ఈ చిత్రిలో బాస్ ఎవరు అని ప్రశ్నించడమే కాకుండా మరో ప్రశ్న కూడా అడిగాడు. అప్పటికే ఆమె ఆగ్రహతం కుతకుతలాడిపోయింది. అతడి నుంచి దూరంగా జరిగి వెళ్లిపోతుండగా ఒక్కసారిగా చేయిపట్టుకొని లాగేందుకు ప్రయత్నిస్తూ 'బేబీ' అంటూ పిలిచాడు. దీంతో ఇక కోపాన్ని ఆపుకోలేక గట్టిగా లాగిపెట్టి ఒక్కటిచ్చింది. అయితే, అతడు ఏం ప్రశ్న వేశాడనే విషయం మాత్రం చెప్పలేదు. అతడి ప్రవర్తనకు ఉలిక్కిపడిన ఆమె కొద్ది సేపటికే కార్యక్రమం కోసం లోపలికి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement