Premiere
-
మూవీ ప్రీమియర్‌లో సందడి చేసిన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ 'ద రాక్' (ఫొటోలు)
-
పాత ఇంగ్లీష్ సినిమాల్లోని హీరోయిన్లా సమంత (ఫోటోలు)
-
ప్రభాస్ 'కల్కి' సరికొత్త రికార్డులు.. ఆ సినిమాల్ని దాటేసి ఏకంగా!
డార్లింగ్ ప్రభాస్ మరికొన్ని గంటల్లో 'కల్కి'తో రాబోతున్నాడు. మూవీ లవర్స్ మధ్య ఇప్పుడంతా దీని గురించే డిస్కషన్ నడుస్తోంది. మరోవైపు టికెట్స్ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సరిగా ప్రమోషన్ చేయనప్పటికీ మూవీపై హైప్ ఉహించిన దానికంటే బాగానే వచ్చింది. ఈ క్రమంలోనే 'కల్కి'తో ప్రభాస్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.(ఇదీ చదవండి: 'కల్కి' థీమ్ సాంగ్ రిలీజ్.. మొత్తం స్టోరీ ఒకే పాటలో!)'కల్కి' సినిమాకి మన దగ్గర ఫుల్ క్రేజ్ ఉందని తెలిసిందే. అమెరికాలోనూ ఈ మూవీకి మామూలు డిమాండ్ లేదు. ఎందుకంటే ఇప్పటికే లక్ష 50 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అలానే 3 మిలియన్ డాలర్ల ప్రీ సేల్స్ జరిగింది. ఒకవేళ హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం అమెరికాలో 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' వసూళ్ల రికార్డులు కొట్టుకుపోవడం గ్యారంటీ.ఇక మన దగ్గర కూడా టికెట్స్ బాగానే సేల్ అవుతున్నాయి. అలానే తొలిరోజు వసూళ్లలో 'ఆర్ఆర్ఆర్' అందుకున్న రూ.223 కోట్ల వసూళ్లని 'కల్కి' బ్రేక్ చేయడం కచ్చితం అనిపిస్తోంది. ఎందుకంటే షోల దగ్గర నుంచి టికెట్ రేట్ల వరకు అన్ని పెంచారు. ఇలా విడుదలకు ముందే పలు రికార్డుల్ని సాధిస్తున్న 'కల్కి'.. థియేటర్లకి వచ్చిన తర్వాత ఇంకెన్ని ఘనతలు సాధిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కల్కి' మిడ్ నైట్ షోలు వేయకపోవడానికి కారణం అదేనా?) -
The Archies Screening: ద ఆర్చీస్ గ్రాండ్ ప్రీమియర్.. కదిలొచ్చిన బాలీవుడ్ స్టార్స్ (ఫోటోలు)
-
సిటాడెల్ ప్రీమియర్ షోలో మెరిసిన తారల తళుకులు (ఫొటోలు)
-
మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' సరికొత్త రికార్డు..
Mahesh Babu Sarkaru Vaari Paata Premiere At 603 Locations: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. మరో వారం రోజుల్లో అంటే మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది ఈ మూవీ. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. 24 గంటలు గడవక ముందే 25 మిలియన్ వ్యూస్ రాబట్టిన ఈ ట్రైలర్ 24 గంటల్లో 27 మిలియన్స్‌పైగా వీక్షణలు సొంతం చేసుకుంది. అలాగే 1.2 మిలియన్స్‌కుపైగా లైక్స్‌తో యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది ఈ మూవీ ప్రచార చిత్రం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా యూఎస్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఎన్నడు లేని విధంగా యూఎస్‌లో 603 ప్రాంతాల్లో రిలీజ్ చేయనున్నారట. పాన్ ఇండియా మూవీస్ తప్పితే ఓ తెలుగు సినిమా ఈ స్థాయిలో ఇన్ని ప్రదేశాల్లో విడుదల కావడం ఇదే తొలిసారి. దీంతో ఈ సినిమా ఓవర్సీస్లో భారీ కలెక్షన్లు రాబట్టడం ఖాయమంటున్నాయి సినీ వర్గాలు. చదవండి: ఆ సాంగ్ చేస్తున్నప్పుడు మహేశ్‌కు సారీ చెప్పా: కీర్తి సురేష్ Super🌟 @urstrulyMahesh sets a new benchmark in TFI ❤️🔥❤️🔥#SVPTrailer is the MOST VIEWED trailer of TFI in 24 hours with 27M+ Views & 1.2M+ Likes! - https://t.co/AMjXMIUh7F@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/DulbFZZssX — Mythri Movie Makers (@MythriOfficial) May 3, 2022 అయితే అక్కడ మే 11న 'సర్కారు వారి పాట' ప్రీమియర్స్ వేయనున్నారు. ఇప్పటికే యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయని సమాచారం. ఈ నెల 7న భారీగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు ముఖ్య అతిథిగా రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. -
ఆ టికెట్లపై జెట్ ఎయిర్వేస్ ఆఫర్
సాక్షి, ముంబై: ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ప్రీమియర్ వన్ వే టికెట్లపై డిస్కౌంట్ ప్రకటించింది. ఎంపిక చేసిన విమానాల్లో ప్రీమియం టికెట్లను రూ.2320(అన్నీ కలుపుకొని) లకే అందిస్తోంది. దేశీయ మార్కెట్లో నెలకొన్ని తీవ్ర పోటీ నేపథ్యంలో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇలా బుక్ చేసుకున్న అనంతరం 12నెలల పాటు చెల్లుబాటయ్యేలా నిర్ణయం తీసుకుంది. ఎకానమీ క్లాస్ కంటే తక్కువ రేటు విమాన టికెట్లతో ప్రయాణించండి, అదనపు సౌలభ్యాలను ఆస్వాదించడంటూ పేర్కొంది. "ఫ్లై ప్రీమియర్ ఎట్ ఎకానమీ ఫేర్స్" అని ప్రకటించింది. దీంతోపాటు 44 ఇంచ్ పిచ్ పెద్ద సిక్స్ వే హెడ్సెట్ ఉచితంగా అందివ్వనుంది. ఈ పథకం కింద తయారుచేసిన బుకింగ్స్ 12 నెలలు చెల్లుబాటవుతాయి. ప్రయానికి కనీసం 30 రోజులు ముందు టికెట్లు బుక్ చేసుకోవాలి. ఇండియాలో జెట్ ఎయిర్వేస్ నిర్వహిస్తున్న విమానాల్లో ఎంపిక చేసిన ప్రీమియర్‌లో వన్-వే ప్రయాణాలకుఈ రేట్లు వర్తిస్తాయి. ఎంపిక చేసుకున్న బుకింగ్ తరగతులకు, ఎలాంటి ప్రయాణ ఆంక్షలు లేకుండా డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. చార్జీల నిబంధనల ప్రకారం పిల్లలు / శిశువుల తగ్గింపు, తేదీ మార్పు, విమాన మార్పు, వాపసు చార్జీలు, వారాంతపు సర్ఛార్జ్, బ్లాక్ అవుట్ కాలం, ప్రయాణ పరిమితి / లేదా విమాన నియంత్రణ వంటివి వర్తిస్తాయి. మరోవైపు అన్నింటినీ లేదా ఏదైనా నియమాలను లేదా షరతులను చేర్చడానికి, సవరించడానికి, మార్చే అధికారంతోపాటు, ఈ ఆఫర్‌ను పూర్తిగా లేదా కొంత భాగాన్ని మార్చడానికి, ముందస్తు నోటీసు లేకుండా ఏ సమయంలో అయినా, ఆఫర్‌ను, పూర్తిగాలేదా పాక్షికంగా ఉపసంహరించుకునే అధికారం తమకుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తగ్గింపు చార్జీల జాబితాను వెబ్సైట్లో ఉంచింది. -
ప్లయింగ్ కారు
నేల మీద కార్ల తరహాలో తిరుగుతూ.. నడవడానికి అసాధ్యమయ్యే ప్రాంతాల్లో పక్షిలా ఎగిరే వాహనాల గురించి సినిమాల్లోనో.. కార్టూన్లలోనో చూసుంటాం. కానీ పీఏఎల్–వి సంస్థ అచ్చం అలాంటి వాహనాలనే తయారు చేసింది. ఇవి నేల మీద ప్రయాణించడంతోపాటు అవసరమైనప్పుడు గాల్లో కూడా ఎగరగలవు. ఈ ఎగిరే కారులోని ప్రత్యేకతలు.. ప్రత్యేక ఫీచర్లు ఇద్దరు కూర్చుని ప్రయాణించే ఈ వాహనాన్ని హైబ్రిడ్ కారు లేదా గైరో ప్లేన్ అంటారు. డచ్‌కు చెందిన పీఏఎల్–వి, యూరోప్ ఎన్వి సంస్థలు ఈ మూడు చక్రాల ఫ్లయింగ్ కారును అభివృద్ధి చేశాయి. ఇది చూడటానికి బైక్ తరహాలో ఉన్నప్పటికీ సౌకర్యం పరంగా కారును పోలి ఉంటుంది. నేల మీద నడవడానికి, గాల్లో ఎగరడానికి అనుకూలంగా ‘టిల్టింగ్’ వ్యవస్థ ఉంటుంది. ఇది నేల మీద ప్రయాణిస్తున్నప్పుడు గాల్లోకి ఎగరాలంటే విమానం తరహాలో కొద్ది దూరం సమతలం మీద ప్రయాణిస్తే నిర్దిష్ట వేగం పొందిన తర్వాత గాల్లోకి ఎగురుతుంది. అయితే టేకాఫ్ కోసం టచ్ ప్యాడ్ మీదున్న టేకాఫ్ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫ్లయింగ్ కారులో ఉన్న సింగిల్ రోటార్, ప్రొపెల్లర్ కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే విచ్చుకుంటుంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో గాల్లో ఎగరడానికి అనుకూలంగా సిద్ధమవుతుంది. ఈ వాహనం గరిష్టంగా 4000 అడుగుల ఎత్తు వరకు గాల్లో ఎగరగలదు. ఇది ఎయిర్ అన్ కంట్రోల్డ్ (వాయు అనియంత్రిత) విజువల్ ఫ్లైట్ రూల్స్ ట్రాఫిక్ విభాగంలోకి రావడం వల్ల వాణిజ్య విమానం తరహాలో అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇందులో ఫ్లైట్ సర్టిఫైడ్ ఎయిర్ క్రాఫ్ట్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది నేల మీద, వాయు మార్గాల్లో గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆకృతి పరంగా హెలికాఫ్టర్‌ని పోలి ఉన్నప్పటికీ హెలికాఫ్టర్లోని మెయిన్ రోటార్తో పోల్చితే.. ఇందులోని మెయిన్ రోటార్ వేగం తక్కువగా ఉంటుంది. ఇందులో ఇంజన్ ఫెయిలయితే దిగులు చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇందులోని గైరోప్లేన్ టెక్నాలజీ రోటార్‌ను తిప్పడానికి సహాయపడుతుంది. తద్వారా తక్కువ వేగం వద్ద ప్రమాదానికి గురికాకుండా సురక్షితంగా ల్యాండ్ చేయవచ్చు. ఈ ప్లయింగ్ కారులో సీసం, మిశ్రమ రహిత పెట్రోల్‌ను వినియోగిస్తారు. ఇది గగన తలంలో ఉన్నప్పుడు లీటర్‌కు 28 కి.మీల మైలేజ్, నేల మీద ప్రయాణిస్తున్నప్పుడు లీటర్‌కు 12 కి.మీల మైలేజ్ ఇస్తుంది. -
నటి చేయిపట్టి లాగిన రిపోర్టర్.. చెంప చెళ్లు
లాస్ ఎంజెల్స్: తిక్క ప్రశ్న వేయడమే కాకుండా తన చేయిపట్టి లాగినందుకు ఓ రిపోర్టర్ చెంపను చెళ్లుమనిపించింది ప్రముఖ హాలీవుడ్ నటి క్రిస్టెన్ బెల్. అతడి ప్రవర్తనను చూసి చిర్రెత్తి పోయింది. ఓ ప్రముఖ వెబ్ సైట్ సేకరించిన వీడియో సమాచారం ప్రకారం ది బాస్ అనే చిత్రం ప్రీమియర్ కార్యక్రమానికి క్రిస్టెన్ బెల్ హాజరైంది. అదే కార్యక్రమానికి వచ్చిన డొనెల్లీ అనే రిపోర్టర్ ఆమె రెడ్ కార్పెట్ పై ఉండగా ముఖానికి దగ్గరగా మైక్ పెట్టి ఇబ్బంది పెట్టేలా, ధ్వంధ్వార్ధం వచ్చేలా ప్రశ్నించాడు. ఈ చిత్రిలో బాస్ ఎవరు అని ప్రశ్నించడమే కాకుండా మరో ప్రశ్న కూడా అడిగాడు. అప్పటికే ఆమె ఆగ్రహతం కుతకుతలాడిపోయింది. అతడి నుంచి దూరంగా జరిగి వెళ్లిపోతుండగా ఒక్కసారిగా చేయిపట్టుకొని లాగేందుకు ప్రయత్నిస్తూ 'బేబీ' అంటూ పిలిచాడు. దీంతో ఇక కోపాన్ని ఆపుకోలేక గట్టిగా లాగిపెట్టి ఒక్కటిచ్చింది. అయితే, అతడు ఏం ప్రశ్న వేశాడనే విషయం మాత్రం చెప్పలేదు. అతడి ప్రవర్తనకు ఉలిక్కిపడిన ఆమె కొద్ది సేపటికే కార్యక్రమం కోసం లోపలికి వెళ్లిపోయారు. -
‘ప్రీమియర్ షో’ దోపిడీని అరికట్టండి
కవాడిగూడ: సినిమా అభిమానులు దోపిడీకి గురికాకుండా ఉండాలంటే ప్రీమియర్ షోలు, ప్రత్యేక ప్రదర్శనలు రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర సినిమా అభిమానుల ఐక్య వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కొత్త సినిమాల విడుదల సందర్భంగా స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టుల పేరుతో ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతులు పొంది నిబంధనలకు విరుద్ధంగా సినిమా ప్రేక్షకులను, అభిమానులను నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు దోచుకుంటున్నారని, సినిమా విడుదలైన వారంలో జరిగే బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టాలని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వేదిక అధ్యక్షులు పూర్ణచందర్రావు, సలహాదారు జీఎల్ నర్సింహారావు మాట్లాడుతూ నిజానికి ప్రీమియర్, ప్రత్యేక షోల ప్రదర్శనల్లో సాధారణ థియేటర్లలో వసూలు చేసే టికెట్ల ధరలనే ప్రత్యేక షోలు వేసేటప్పుడు తీసుకోవాలన్నారు. అలా కాకుండా అభిమానుల సెంటిమెంట్ బలహీనతను అడ్డం పెట్టుకొని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఒక్కో షో టిక్కెట్ ధరను రూ. 2 నుంచి 3 వేల వరకూ వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఈ రకమైన చర్యలు సినిమాటోగ్రఫీ చట్టంలోని సెక్షన్ 9 (ఎ) ప్రకారం నేరమన్నారు. సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా ప్రీమియర్ షో పేరిట లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. సమస్యలు వస్తే జనంలోకి వస్తాను, ప్రభుత్వాన్ని నిలదీస్తాను, ప్రతిస్పందిస్తాను అని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఈ దోపిడీ కన్పించడం లేదా అంటూ ప్రశ్నించారు. సమావేశంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు రాహుల్, సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు బొట్టు బాబు తదితరులు పాల్గొన్నారు.