అప్పుడుప్పుడు టీవీ చానెళ్లలో రిపోర్టర్లు వేసే అతి వేషాలు ప్రేక్షలకు విసుగు తెప్పిస్తుంటాయి. కొన్ని సార్లు రిపోర్టర్లు ఎక్కడ ఉన్నాం, దేని గురించి మాట్లాడుతున్నామో కనీస అవగాహన లేకుండా అలా వాగుతూనే ఉంటారు. ప్రసుత్తం ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది పాత వీడియోనే కానీ మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ.. నవ్వులు పూయిస్తోంది. అమెరికాకు చెందిన కేటీఎల్‌ఏ న్యూస్ స్టేషన్‌కు చెందిన ఓ రిపోర్టర్.. ఓ సంఘటన గురించి రిపోర్ట్ చేస్తూ.. చేసిన వ్యాఖ్యలు కోపంతో పాటు నవ్వు తెప్పిస్తాయి. ఈ వీడియోలో సదరు రిపోర్టర్ మాట్లాడుతూ.. ‘చనిపోయిన వ్యక్తిని మేం కలుసుకున్నాం. కాకపోతే ప్రస్తుతం దీనిపై స్పందించడానికి అతను అందుబాటులో లేడు.. త్వరలోనే మరిన్ని వివరాలతో మిమ్మల్ని కలుసుకుంటాను’ అంటూ రిపోర్టింగ్ చేసింది.
When I say I nearly passed out from laughing... pic.twitter.com/TJgpLocqrL
— Yashar Ali 🐘 (@yashar) September 16, 2019
ఈ వీడియో చేసిన జనాలు.. ‘నీ తెలివి తెల్లారినట్లే ఉంది.. చనిపోయిన వ్యక్తి ఎలా స్పందిస్తాడు’.. ‘ఒక్కసారి అతడు లేచి మాట్లాడాల్సి ఉండేది.. అప్పుడు నీ రోగం కుదిరేది’.. ‘రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదవడం తప్ప వీరు సొంతంగా ఆలోచించలేరు’ అంటూ కామెంట్ చేస్తున్నారు జనాలు.
Comments
Please login to add a commentAdd a comment