పెద్దయ్యాక ఏమవుతావ్‌.. రిపోర్టర్‌ ప్రశ్నకు పిల్లవాడి దిమ్మతిరిగే సమాధానం | Reporter Asks Boy What Will You Do When You Grow Up, His Answer Will Make You Laugh | Sakshi
Sakshi News home page

పెద్దయ్యాక ఏమవుతావ్‌.. రిపోర్టర్‌ ప్రశ్నకు పిల్లవాడి దిమ్మతిరిగే సమాధానం

Published Mon, Jan 10 2022 5:18 PM | Last Updated on Mon, Jan 10 2022 5:43 PM

Reporter Asks Boy What Will You Do When You Grow Up, His Answer Will Make You Laugh - Sakshi

త్వరలో దేశంలోని అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఐదింటిలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. యూపీలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. ఇటు మీడియా సైతం ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలపై దృష్టి పెడుతున్నారు.

ఈ క్రమంలో ఓ న్యూస్‌ రిపోర్టర్‌, చిన్న పిల్లవాడికి మధ్య జరిగిన సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియోలో న్యూస్‌ ఛానల్‌ రిపోర్టర్‌ ఓ అబ్బాయి వద్దకు వచ్చి పెద్ద అయ్యాక నువ్వు ఏం అవుతావ్‌ అని ప్రశ్నించాడు. దీనికి అతను ఎవరూ ఉహించని విధంగా సమాధానం చెప్పాడు. ‘చదువుకోకపోతే ఏం అవుతాము. ఏం అవ్వము.. ఒకవేళ చదువుకుంటే పెద్దయ్యాక పని చేస్తాను. ఓ ఇల్లు కట్టుకుంటాను. మంచిగా స్థిరపడతా. తిని తాగుతా.. పెళ్లి చేసుకొని భార్యను తెచ్చుకుంటా. ఇద్దరు, ముగ్గురు పిల్లల్ని కంటా.. అంటూ సమాధానిమిచ్చాడు.
చదవండి: ఆ ఆనందం వెలకట్ట లేనిది!: హృదయాన్ని కదిలించే వైరల్‌ వీడియో!:

అయితే పిల్లవాడు ఇచ్చిన ఫటాఫట్‌ సమాధానాలకు రిపోర్టర్‌తోపాటు అక్కడున్న వారంతా పగలబడి నవ్వారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్‌ చేయడంతో ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ‘పిల్లవాడు ఎంతో తెలివిగా ఆలోచించాడు. నేటి జీవితంలో విద్య విలువ ఇప్పటికే తెలుసుకున్నాడు. శభాష్‌ బేటా’ అంటూ కామెంట్లు చేస్తున్నాడు. 
చదవండి: వైరల్‌: హర్యానా రాణితో ముసలాయన స్టెప్పులు.. తగ్గేదేలే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement