సుమారు రూ.20 లక్షల విలువైన 340 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సయిజ్ సీఐ ఖలీం విలేకరులకు తెలిపారు.
నర్సీపట్నం రూరల్, న్యూస్‌లైన్ : సుమారు రూ.20 లక్షల విలువైన 340 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సయిజ్ సీఐ ఖలీం విలేకరులకు తెలిపారు. ఎక్సయిజ్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు డిగ్రీ కళాశాల సమీపంలో నెల్లిమెట్ట వద్ద మంగళవారం ఉదయం సిబ్బందితో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. చింతపల్లి వైపు నుంచి తరలిస్తున్న సుమో వాహనంలో గంజాయి మూటలను తరలి స్తున్న ముఠాసభ్యులు తమను గమనిం చి కొద్దిదూరంలో వాహనాన్ని నిలిపివేసి పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు. ముగ్గురు తప్పించుకోగా జి. మాడుగుల మండలం కాట్రేగుల పం చాయతీకి చెందిన గబ్బాడ చంద్రశేఖర్ (26)ను అదుపులోకి తీసుకున్నామన్నారు. వాహనాన్ని, గంజాయి మూట లను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించామన్నారు. పరారైన రోలుగుంట మండలం బుచ్చింపేట గ్రామానికి చెందిన జిగిరెడ్డి నాయుడు, అనిమిరెడ్డి వెంకునాయుడు, గాలి నూకరాజు కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.
30 కేజీల గంజాయి స్వాధీనం
పట్టణ పోలీసులు చింతపల్లి రూట్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా తౌడుబస్తాల్లో తరలిస్తున్న 30 కేజీల గంజాయిని పట్టుకున్నారు. తమను గమనించిన నిందితులు గంజాయి మూటలను విడిచిపెట్టి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు.
200 కిలోల గంజాయి స్వాధీనం
జి.మాడుగుల : ఆంధ్ర-ఒరిస్సా రాష్ట్ర సరిహద్దు గ్రామాల నుంచి జీపులో మైదాన ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిను స్వాధీనం చేస్తుం డగా జి.మాడుగుల పోలీస్ స్టేషన్ సీఐ కృష్ణ విలేకరులకు తెలిపారు. ఆంధ్ర-ఒరిస్సా రాష్ట్ర సరిహద్దు గ్రామాల నుంచి సోమవారం రాత్రి జీపులో గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారంతో జి. మాడుగుల మండలం ఈదులబయలు కూడలి వద్ద పోలీస్ సిబ్బందితో మాటు వేసి పట్టుకొన్నామని ఆయన తెలి పారు. మైదాన ప్రాంతాలకు తరలి స్తున్న సుమారు 200కిలోల శీలవతి రకం గంజాయి, జీపును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. తమ రాక గమనించిన స్మగ్లర్లు పరారయ్యారని చెప్పారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.10 లక్షలుంటుందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఆయన వెంట ఎస్‌ఐ సన్యాసినాయుడు ఉన్నారు.