
ఛాటోగ్రామ్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యం కలుపుకుని భారత్ 513 పరుగుల భారీ లక్ష్యాన్ని బంగ్లా ముందు ఉంచింది. ఆటకు రెండు రోజుల సమయం మిగిలిఉన్న నేపథ్యంలో కచ్చితంగా ఫలితం వచ్చే అవకాశముంది.
ప్రస్తుత పరిస్ధిల బట్టి చూస్తే బంగ్లా కంటే భారత్‌కే విజయ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 513 పరుగుల టార్గెట్ చేధించడం అంత ఈజీ కాదు. అయితే వికెట్లు కాపాడుకొని ఈ మ్యాచ్‌ను డ్రా చేసే అవకాశమైతే బంగ్లాకు ఉంది.
ఇక దాదాపు రేండేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించాడు. ఇక మూడో రోజు ఆట ముగిసిన అనంతరం కుల్దీప్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా కుల్దీప్ యాదవ్‌కు ఒక విలేకరి నుంచి పిచ్చి ప్రశ్న ఎదురైంది.
513 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి తొలి టెస్టును బంగ్లాదేశ్ గెలిచే అవకాశం ఉందని అనిపించడం లేదా? అని ప్రశ్నించాడు. దానికి బదులుగా కుల్దీప్ నవ్వుతూ స్పందించాడు. "వ్యక్తిగతంగా అయితే అలా జరగకూడదని నేను కోరు కుంటున్నాను. కానీ క్రికెట్‌లో ఏది అయినా జరగవచ్చు.
బంగ్లా బ్యాటర్లలో ఎవరో ఒకరు 300 సాధిస్తే మీరు అనుకుంటుంది జరగవచ్చు. మేము వీలైనంత త్వరగా మ్యాచ్‌ను ముగించడానికి ప్రయత్నిస్తాము. నాలుగో రోజు అదే మా ప్రధాన లక్ష్యం" అంటూ కుల్దీప్ దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చాడు. ఇక నాలుగో రోజు డ్రింక్స్ విరామానికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసింది.
చదవండి: Shubman Gill: డెబ్యూ సెంచరీతోనే అరుదైన రికార్డు కొట్టిన గిల్