
ఛాటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 188 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 513 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన 324 పరుగులకు ఆలౌటైంది. బారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు, కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా.. మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, అశ్విన్ తలా వికెట్ పడగొట్టారు.
ఇక బంగ్లాదేశ్ బ్యాటర్లలో ఓపెనర్ జాకీర్ హసన్ సెంచరీతో మెరవగా.. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 84 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగుల ఆధిక్యం అందుకున్న భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.
భారత రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (110), పుజారా (102 నాటౌట్) అద్భుతమైన సెంచరీలు సాధించారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 150 పరుగులకే కుప్పకూలింది. భారత తొలి ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్(86), పుజారా(90) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఢాకా వేదికగా డిసెంబర్ 22 నుంచి ఫ్రారంభం కానుంది.
చదవండి: IPL 2023: అతడికి ఐపీఎల్ సెట్ కాదు.. భారత స్టార్ ఆటగాడిపై కార్తీక్ సంచలన వాఖ్యలు