ఆయన నిద్రపోతున్నారు..! | he is sleeping, dawood ibrhim wife says to reporter | Sakshi
Sakshi News home page

ఆయన నిద్రపోతున్నారు..!

Published Sat, Aug 22 2015 3:02 PM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

ఆయన నిద్రపోతున్నారు..!

ఆయన నిద్రపోతున్నారు..!

న్యూఢిల్లీ: భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్లోని కరాచీలో ఉన్నాడని మరోసారి రుజువైంది. ఓ జాతీయ చానెల్ దావూద్ ఇంటి ఫోన్ నెంబర్ సంపాదించి ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. శనివారం మధ్యాహ్నం ఆ చానెల్ రిపోర్టర్ దావూద్ ఇంటికి ఫోన్ చేయగా.. ఆయన భార్య మెహజబీన్ షేక్ ఫోన్ లిఫ్ట్ చేసింది. దావూద్తో మాట్లాడాలని రిపోర్టర్ చెప్పగా.. ఆయన నిద్రపోతున్నాడని మెహజబీన్ షేక్ సమాధానమిచ్చింది. మీరు కరాచీలోనే ఉంటున్నారు కదా అని రిపోర్టర్ ప్రశ్నించగా ఆమె అవునని చెప్పింది. మరిన్ని వివరాలు అడిగేందుకు ఈ రిపోర్టర్ ప్రయత్నించగా దావూద్ భార్య ఫోన్ కట్ చేసింది. రిపోర్టర్, మెహజబీన్ షేక్ల మధ్య సాగిన ఫోన్ సంభాషణలు..

రిపోర్టర్: హలో సలామలేకుమ్.. మేడం మీరు మెహజబీన్ షేక్.. అవునా
దావూద్ భార్య: అవును,.. ఏం కావాలి
రిపోర్టర్: మేడం మీరు కరాచీ నుంచే మాట్లాడుతున్నారా
దావూద్ భార్య: అవును.. మీరు ఎవరు
రిపోర్టర్: మేడం మీరు దావూద్ ఇబ్రహీం భార్య అవునా కాదా
దావూద్ భార్య: అవును.. ఆయన నిద్రపోతున్నారు
రిపోర్టర్: నేను దావూద్ ఇబ్రహీంతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన ఉన్నారా
దావూద్ భార్య: మీరు ఎవరు... (ఫోన్ కట్ అయింది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement