రంగస్థల కళాకారుడు మోతుకూరు మునిస్వామి (59) గురువారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందారు. పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్న ఆయన స్వామి క్రియేటివ్ ఆర్ట్స్ సంస్థను ఏర్పాటు చేసి ఎంతో మంది కళాకారులు, సినిమా నటులకు సన్మానాలు చేశారు. పాత్రికేయుడుగా పనిచేశారు.
ప్రొద్దుటూరు టౌన్ : రంగస్థల కళాకారుడు మోతుకూరు మునిస్వామి (59) గురువారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందారు. పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్న ఆయన స్వామి క్రియేటివ్ ఆర్ట్స్ సంస్థను ఏర్పాటు చేసి ఎంతో మంది కళాకారులు, సినిమా నటులకు సన్మానాలు చేశారు. పాత్రికేయుడుగా పనిచేశారు. ఈయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ పట్టణ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మునిస్వామి మృతికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి, పట్టణాధ్యక్షుడు ఘంటసాల వెంకటేశ్వర్లు, జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బద్వేలి శ్రీనివాసులరెడ్డి, వైస్ చైర్మన్ జబివుల్లా, కౌన్సిలర్లు, నాయకులు బండి భాస్కర్ సంతాపం తెలిపారు.