రాజ్యంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్.అంబెద్కర్ చిత్రపటాన్ని తొలగించి ఆయనను అవమానపరిచారని దళిత విద్యార్థి సంఘాలు మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం ధర్నా నిర్వహించాయి.
కడప : రాజ్యంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్.అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించి ఆయనను అవమానపరిచారని దళిత విద్యార్థి సంఘాలు మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం ధర్నా నిర్వహించాయి. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని మున్సిపల్ కార్యలయంలోని కమిషనర్ చాంబర్‌లో ఉన్న అంబేద్కర్ చిత్రపటాన్ని రెండురోజుల కిందట తొలగించారు. దాన్ని తిరిగి పునరుద్ధరించేంత వరకు తమ నిరసన కొనసాగుతుందని సంఘం నాయకులు తెలిపారు.
(ప్రొద్దుటూరు)